నిమ్మకాయ రోటి పచ్చడి.. ఇలా చేస్తే టేస్ట్ నెక్స్ట్ లెవెల్

నిమ్మకాయతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. నిమ్మకాయను అనేక వంటల్లో వాడతారు. అయితే నిమ్మకాయ నిల్వ పచ్చడి చాలా మంది తయారు చేస్తుంటారు. కానీ నిమ్మకాయ రోటి పచ్చడి అటు టేస్టుతో పాటు ఇటు ఆరోగ్యాన్నీ ఇస్తుంది. మరి నోరూరించే సూపర్ టేస్టీ నిమ్మకాయ రోటి పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు ఏంటి..? ఈ పచ్చడిని ఎలా తయారు చేయాలి..?

నిమ్మకాయ రోటి పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు చూస్తే.. నిమ్మకాయలు మూడు లేదా నాలుగు, పచ్చిమిర్చి తగినన్ని, నూనె ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు పది, కరివేపాకు మూడు రెమ్మలు, కొత్తిమీర గుప్పెడు, మెంతులు పావు టీ స్పూన్, మిరియాలు అర టీ స్పూన్, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్, ఆవాలు ఒక టేబుల్ స్పూన్, ఉల్లియాయ ఒకటి, కరివేపాకు మూడు రెమ్మలు, కొత్తిమీర గుప్పెడు, ఉప్పు రుచికి సరిపడా, పసుపు చిటికెడు తీసుకోవాలి.

నిమ్మకాయ రోటి పచ్చడి తయారీ విధానం చూస్తే.. ముందుగా పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలి. వెల్లుల్లి రెబ్బలపై పొట్టు తీయాలి. ఉల్లిపాయలను కట్ చేసుకోవాలి. అలాగే నిమ్మకాయలను కట్ చేసి నిమ్మరసం పిండి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకోవాలి. అందులో నూనె వేసి వేడి చేసుకోవాలి. కాగిన నూనెలో ఆవాలు, మెంతులు, మిరియాలు, జీలకర్ర వేయి వేయించుకోవాలి. ఆ తర్వాత ఇందులో పచ్చిమిర్చి తుంపలు వేసి వేయించుకోవాలి.

Lemon Roti Pickle Magic This Secret Method Takes the Taste to the Next Level

ఇప్పుడు అందులో వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర తరుగు వేసి కలపాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు పచ్చిమిర్చి మిశ్రమాన్ని రోట్లో వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి కాస్త బరకగా నూరుకోవాలి. ఆ తర్వాత అందులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి దంచుకోవాలి. చివరగా నిమ్మరసం పోయాలి. స్పూన్ తో మరోసారి మెత్తగా రుబ్బి గిన్నెలోకి తీసుకుంటే సరి. సూపర్ టేస్టీ నిమ్మకాయ రోటి పచ్చడి రెడీ అయినట్టే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+