Lemon: నిమ్మరసం అతిగా తీసుకుంటున్నారా.. అయితే జాగ్రత్త..!

నిమ్మకాయ శరీరానికి చాలా మంచిది. నిమ్మకాయ‌లు సీజ‌న‌ల్‌ రోగాలు ధ‌రిచేర‌కుండా శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. తరచూ నిమ్మరసం తాగడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. విటమిన్ సి లోపాన్ని భర్తీ చేయడానికి నిమ్మకాయ మంచి వనరుగా పని చేస్తుంది. అలాగే ఆరోగ్యంతో పాటు చర్మ, జుట్టు సౌందర్యానికి కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. కానీ నిమ్మరసాన్ని అతిగా వాడితే ఆరోగ్యంతో పాటు సౌందర్యానికి కూడా ముప్పు వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు.

సిట్రిక్ యాసిడ్
శరీరానికి ఏ పదార్థలైనా అతిగా అందిస్తే అది అనారోగ్యం పాలవుతారు. నిమ్మరసాన్ని కూడా అతిగా తీసుకుంటే శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. నిమ్మరసం పుల్లగా ఉండేందుకు కారణం ఇందులోని సిట్రిక్ యాసిడ్ ప్రధాన కారణం. బాడీలో సిట్రిక్ యాసిడ్ ఎక్కువైతే ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. నిమ్మ రసాన్ని ఇతర పదార్థాలు ద్రవలతో కలిపి తీసుకుంటే జీర్ణ వ్యవస్థ బాగుంటుంది. అయితే నిమ్మ రసాన్ని ఎటువంటి పదార్థాలతో కలపకుండా నేరుగా తీసుకుంటే కడుపులో యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు.

lot of disadvatage of lemon in telugu
ఎనామిల్
నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ దంతాల ఎనామిల్ ను దెబ్బతీసే అవకాశం ఉంటుందట. దంతాలపై ఉండే ఎనామిల్ దంతాల ఆరోగ్యాన్ని సంరక్షించే రక్షణ కవచంగా సహాయపడుతుంది. దంతాలపై ఎనామిల్ దెబ్బతిని దంతాలు పుచ్చడం, అరిగిపోవడం వంటి దంత సమస్యలు ఏర్పాడుతాయని నిపుణులు చెబుతున్నారు. నిమ్మరసంలో విటమిన్ సి, టైరమిన్ అనే అమినో యాసిడ్స్ ఉంటాయి. ఇవి శరీరంలో అధిక మొత్తంలో ఉన్నప్పుడు బ్రెయిన్ కు రక్తప్రసరణను ఒక్కసారిగా పెంచుతాయి. ఫలితంగా తలనొప్పి వచ్చే అవకాశం ఉంది.

అల్సర్
నిమ్మరసంలో ఉండే అసిడిక్ నేచర్ కారణంగా శరీరానికి విటమిన్స్ అధిక మొత్తంలో అందుతుంది. శరీరంలో విటమిన్ సి అధికంగా ఉన్నప్పుడు అది యూరినేషన్ ను పెంచుతుంది. ఫలితంగా ఎక్కువసార్లు మూతవిసర్జన జరుగుతుంది. కనుక నిమ్మ రసాన్ని తగిన మోతాదులో తీసుకోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. నిమ్మ రసాన్ని అధిక మొత్తంలో తీసుకున్నప్పుడు పొట్ట భాగంలో ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఇవి పేగుల్లో అంతర్గత లైనింగ్ ను దెబ్బతీసి పెప్టిక్ అల్సర్ కు కారణమయ్యే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+