మామిడిపండు ఈ సమస్యలు ఉన్న వారికి చాలా డేంజర్..!!
వేసవిలో అందరికీ గుర్తొచ్చేది మామిడి పండు. వయసుతో సంబంధం లేకుండా అందరూ మామిడి పండ్లను ఇష్టపడతారు. పండిన మామిడి పండ్లను ముక్కలుగా కోసుకుని తినడం ఒక అద్భుతమైన అనుభూతి. అయితే, మామిడి పండ్లు తిన్న తర్వాత మొటిమలు రావడం, బరువు పెరగడం, రక్తంలో చక్కెర పెరగడం, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయనే ఆందోళన చాలా మందిలో ఉంది. అయితే, కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్న వారు వీటిని తినకూడదు. ఎందుకంటే, తిన్న దగ్గర నుంచి కొత్త సమస్యలు స్టార్ట్ అవుతాయి. కాగా.. అసలు మామిడికి ఎవరు దూరంగా ఉండాలో నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.
మామిడి పండులో పలు రకాల పోషకాలు ఉన్నాయి. విటమిన్ A, విటమిన్ C, విటమిన్ E పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా, ఇందులో విటమిన్ B6, ఫోలేట్, కెరోటినాయిడ్లు కూడా ఉంటాయి. ఇవి శరీర కణాల అభివృద్ధికి, కంటి చూపు మెరుగుపడటానికి సహాయపడతాయి. జీర్ణ సంబంధిత సమస్యలతో బాధ పడేవారు మామిడి పండ్లను ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. వీటిని తినడం వల్ల కడుపులో అజీర్తి, మల బద్ధకం లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మామిడి పండ్లు సహజంగానే తియ్యగా ఉంటాయి.ఎందుకంటే దీనిలో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అలాగే, దీనిలో క్యాలరీలు కూడా ఉంటాయి. వీటిని అదే పనిగా తింటే బరువు అమాంతం పెరుగుతారు. డయాబెటిస్ ఉన్న వారు మామిడి పండ్లను తినకపోవడమే మంచిది లేదంటే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. అలాగే, మధుమేహంతో ఇబ్బంది పడేవారు కూడా వీటికి ఎంత దూరం ఉంటే అంత మంచిది.

నిపుణుల సూచనలు
ముందుగా మామిడి పండును తినే ముందు 2-3 గంటలు నీటిలో నానబెట్టడం మంచిది. ఇలా చేస్తే పండులోని వేడి తగ్గుతుంది. ఫైటిక్ యాసిడ్ తగ్గుతుంది. మొటిమలు, కడుపు నొప్పి సమస్యలు తగ్గుతాయి. మామిడి పండును భోజనంతో కలిపి తినడం మంచిది కాదు. ఇలా చేస్తే జీర్ణక్రియ సరిగ్గా జరగదు. గ్యాస్, ఉబ్బరం, మొటిమలు రావచ్చు. భోజనం చేసిన 2-3 గంటల తర్వాత లేదా భోజనం ముందు ఒక గంటకు తినడం మంచిది. మధుమేహం ఉన్నవారు మామిడి పండ్లను మితంగా తీసుకోవడం, సరైన సమయంలో తినడం చాలా ముఖ్యం. ఆహారం తీసుకున్న 1-2 గంటల తర్వాత తినడం మంచిది. ముఖ్యంగా మధ్యాహ్న భోజనానికి, సాయంత్రం స్నాక్స్‌కి మధ్యలో తీసుకోవడం మంచిది. మామిడి జ్యూస్ కంటే పండును నేరుగా తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే జ్యూస్‌లో పీచుపదార్థం తగ్గిపోతుంది. షుగర్ లెవల్స్ వేగంగా పెరుగుతాయి. జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది.












Click it and Unblock the Notifications