లైంగిక సమస్యలుంటే ఇవి రెండూ కలిపి తీసుకోండి... అద్భుతం!
ప్రస్తుత వేగవంతమైన జీవితంలో చాలామంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. దీనివల్ల అతి చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. నిత్యం చిన్న చిన్న కారణాలతోనే ఆస్పత్రుల చుట్టూ తిరగడం కూడా సర్వసాధారణంగా మారింది. శారీరకంగా బలహీనతకు గురైతే వ్యాధులు చుట్టుముడతాయి. అందుకే వ్యాధినిరోధకశక్తిని పెంచుకోవాలి. రోజువారీ డైట్ లో కచ్చితంగా కొన్ని పోషక విలువలు ఉండే ఆహారాలను చేర్చుకోవాలి. పాలు, ఖర్జూరం గొప్పతనం గురించి తెలుసుకుందాం.
పాలు, ఖర్జూరం ప్రయోజనాలు: పాలు, ఎండు ఖర్జూరంలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఖర్జూరంలో కాల్షియం, పీచు, జింక్, మెగ్నీషియం, ఐరన్, విటమిన్లు A, C, E, K, B2, B6, నియాసిన్, థయామిన్ ఉంటాయి. పురుషుల్లో శక్తిని ఇవి రెట్టింపు చేస్తాయి. పాలలో ఉండే కాల్షియం, సోడియం, పొటాషియం శరీరానికి అవసరమైన బలాన్ని అందిస్తాయి. బరువు తక్కువగా ఉండేవారు బరువు పెరగడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అటువంటివారికి ఈ పానీయం కచ్చితంగా సరిపోతుంది. ప్రొటీన్ ఎక్కువగా ఉండటంవల్ల బరువు పెరగడానికి తోడ్పడుతుంది. జిమ్ ట్రైనర్లు కూడా బరువు పెరగాలని వచ్చేవారికి ఎండిన ఖర్జూరాలను తినాలని సూచిస్తుంటారు.

ఆస్తమా రోగులకు మేలు: శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతుంటే ఖర్జూరం, పాలు కలిపి తీసుకోవాలి. ఆస్తమా రోగులకు పాలు, ఖర్జూరాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. సంతానోత్పత్తి శారీరక బలహీనత, లైంగిక సమస్యలతో బాధపడుతున్న పురుషులకు పాలు, ఖర్జూరాలను వినియోగిస్తే ఫలితం ఉంటుంది. ఈ రెండింటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పురుషుల్లో క్తి పెరుగుతుంది. ఖర్జూరంలో టెస్టోస్టిరాన్ హార్మోన్‌ను పెంచే గుణం ఉండి వారి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఖర్జూరాన్ని పాలలో వేసి మరిగించి రాత్రి పడుకునే ముందు తాగాలి.












Click it and Unblock the Notifications