మొబైల్ ఫోన్ దిండు కింద పెట్టుకుని నిద్రపోతున్నారా..!?
మొబైల్ ఇప్పుడు ప్రతీ ఇంటి.. ప్రతీ చేతిలో కామన్ అయిపోయింది. నిత్యావసర వస్తువుగా ప్రతీ ఒక్కరి జీవితంలో మారిపోయింది. ఉదయం లేచిన వేళ నుంచి రాత్రి నిద్రపోయే వరకు ప్రతీ నిమిషం మొబైల్ పక్కన ఉండాల్సిందే. చాలా మందికి రాత్రి సమయంలో నిద్ర వేళ తమ దిండు కిందనే ఫోన్ పెట్టుకొని పడుకోవటం అలవాటు. ఫోన్ వచ్చినా.. సమయం చూడటం కోసం ఇలా మొబైల్ ను దిండు కిందనే ఉంచుతున్నారు. అయితే, నిద్రపోతున్నప్పుడు మీ ఫోన్‌ను దిండు కింద పెట్టటం ద్వారా ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మొబైల్ వినియోగం పరిమితి మించి పోతోంది. వయసు తో సంబంధం లేని వినియోగం బాగా పెరిగింది. ప్రతీ ఒక్కరికీ తప్పనసరి వస్తువుగా మారింది. మొబైల్ ఎక్కువగా వినియోగించటం ద్వారా అనేక రకాలుగా ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా మంది రాత్రి వేళ లోనూ నిద్ర సమయంలో తమ దిండు కిందే మొబైల్ ఉంచుతారు. మొబైల్ ఫోన్ల నుంచి రేడియేషన్ విడుదలవుతుంది. ఈ రేడియేషన్ ప్రమాదకరమైంది. ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. వైద్య నిపుణుల ప్రకారం.. మొబైల్ ఫోన్ల నుంచి వచ్చే రేడియేషన్ వల్ల మెదడులో కణితులు ఏర్పడే ప్రమాదముంది. అలాగే పలు క్యాన్సర్లు రావడానికి అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దిండు కింద ఫోన్ పెట్టుకుని నిద్రిస్తున్నప్పుడు రేడియేషన్ నేరుగా తలకు చేరుకుంటుంది. దీని వల్ల తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తే అవకాశాల పైన నిపుణులు హెచ్చరిస్తున్నారు.














Click it and Unblock the Notifications
