ఆ వారంలోనే 'హార్ట్ ఎటాక్స్' అధికం.. తాజా సర్వే ఏం చెబుతుంది..?
ప్రస్తుతం మారుతున్న జీవనశైలి.. ఉరుకులు పరుగుల జీవితం, మారిన ఆహారపు అలవాట్లు, స్ట్రెస్ ఫుల్ లైఫ్.. తదితర కారణాల వల్ల రోజురోజుకు గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. ఇటీవల వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ప్రాబ్లమ్స్ మరింతగా పెరుగుతున్నాయి. ఈ కారణంతో చనిపోతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లదే అధిక వాటా అని నిపుణులు చెబుతున్నారు.
ఇక సాధారణంగా ఉద్యోగులు, విద్యార్థులు వీకెండ్ కోసం ఎదురుచూస్తుంటారు. వీక్ మొత్తం పనిలో పడిపోతారు. వీకెండ్ ను తెగ ఎంజాయ్ చేయాలని ప్లాన్స్ వేసుకుంటుంటారు. మళ్లీ మండే నుంచి స్కూళ్లు, ఆఫీసుల బాట పట్టాల్సిందే. అయితే తాజా అధ్యయనంలో ఓ సంచలన రిపోర్టు బయటకు వచ్చింది. ఇటీవల జైపూర్ లోని సవాయి మాన్ సింగ్ హాస్పిటల్ చేసిన ఓ సర్వే కీలక విషయాలను వెల్లడించింది. సోమవారం ఉద్యోగులపై పని భారం మాత్రమే కాకుండా.. వారి గుండెపై భారం కూడా ఎక్కువే పడుతుందని ఈ నివేదికలో తేలిందని వివరించింది.

వీకెండ్ స్టార్ట్ అయిన దగ్గర్నుంచి ఎంతో సంతోషంగా గడిపిన తర్వాత మళ్లీ ఆఫీస్ కు వచ్చేసరికి పెండింగ్ లో ఉన్న వర్క్ లు, అధికారులతో మీటింగ్ లు, డెడ్ లైన్లు, టార్గెట్ లు కారణంగా ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందని తాజా సర్వేలో తేలింది.












Click it and Unblock the Notifications