రోజూ ఒక టీ స్పూన్ పొడితో షుగర్ కంట్రోల్- గుండె, లివర్ సేఫ్..!!
మునగ ప్రకృతి ప్రసాదించిన ఔషధ నిధి. ఇందులో ఆరోగ్యానికి ఉపయోగపడే పోషకాలు ఉంటాయి. మునగ ఆకుల్లో విటమిన్ A,C,Eలతో పాటు కాల్షియం, పొటాషియం, ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. అందుకే దీన్ని 'సూపర్ ఫుడ్' అని అంటారు. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో, రక్తహీనత ప్రమాదాన్ని తగ్గించడంలో, ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి. ఆకులతో పప్పు, కూర లేదా పొడిని తయారు చేసి ఆహారంలో చేర్చుకోవచ్చు. అనేక రకాల ఆరోగ్య సమస్యల నియంత్రణలో మునగ సమర్ధవంతంగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
మునగలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అనేక రకాల జబ్బులను నయం చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదంలో ఈ చెట్టుకు సంబంధించిన బెరడు, ఆకులు, కాయలు ఇలా ప్రతి ఒక్కటి మంచి ఔషధంగా పనిచేస్తుందని చెబుతారు. క్రమం తప్పకుండా మునగ తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని వెల్లడిస్తున్నారు. ఇందులో ఉండే శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తి పెంచి, ఇన్ఫెక్షన్ల బారినపడకుండా కాపాడతాయి. కాగా, షుగరు బాధితులకు మునగాకు మంచి మందుగా పని చేస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిల నియంత్రణలో సహాయ పడుతుంది. మునగాకు లో ఇన్సులిన్ లాంటి ప్రొటీన్లను కలిగి ఉండటంతో ముధుమేహ బాధితులకు ఎంతో మేలు చేస్తుంది. ఈ ఆకు రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి, రక్తహీనతను తగ్గిస్తుంది.

నిపుణుల సూచనలు
కాగా.. వయసు పెరిగేకొద్దీ వచ్చే ఎముకల బలహీనతను అరికట్టేందుకు మునగాకులోని కాల్షియం, ఫాస్పరస్ తోడ్పడతాయి. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ నియంత్రణకు మునగాకు తోడ్పాటు అందిస్తుంది. దీంతో, రక్త నాళాల్లో అడ్డంకులు తొలిగి.. గుండె ఆరోగ్యంతో పాటుగా.. గుండె ప్రమాదాలను తగ్గించేందుకు సహాయ కారిగా నిలుస్తుంది. శరీరంలోని అనవసరపు కొవ్వును కరిగించడమే కాకుండా, జీవక్రియను వేగవంతం చేయటం లో మునగాకు సమర్ధవంతంగా పని చేస్తుంది. ఇక.. లివర్ సమస్యలకు మునగాకు మంచి పరిష్కారం. మద్య పానం కారణంగా కాలేయం లో సమస్యలు ఏర్పడితే..మునగాకు కషాయం తాగితే చాలా మంచిది. దీని ద్వారా కాలేయంలోని విషతుల్యాలను బయటకు పంపి.. ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే.. మునగాకు ను కొన్ని పదార్థాలతో కలిపి తీసుకుంటే ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. కఫైన్ తో కలిపి అసలు తీసుకోకూడదు. మునగాకుని ఏ రూపంలో తీసుకున్నా సరే వెంటనే కాఫీ తాగడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. దీంతో.. మునగాకు పరిమితంగా వినియోగిస్తే ఆరోగ్య పరమైన ప్రయోజనాలు అందుతాయని చెబుతున్నారు.



Click it and Unblock the Notifications