ఉదయం ఖాళీ కడుపుతో ఇవి 4 తింటే ఇన్ని లాభాలా..?

ఉదయం ఖాళీ కడుపుతో వీటిని 4 తింటే సహజంగా శక్తిని పెంచడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఎముకలను కూడా బలపరుస్తాయి. ఇందులో ఐరన్, కాల్షియం, సహజ చక్కెరలు సమృద్ధిగా ఉంటాయి. దాంతో శరీరానికి అనేక పోషకాలు అందుతాయి. ఆరోగ్యానికి అద్భుతమైన ఉదయపు ఆరంభం కోసం వీటిని కచ్చితంగా తినాలని వైద్యులు చెబుతున్నారు. అవే ఖర్జూరాలు. ఖర్జూరాలు ప్రతి రోజూ పరిగడుపున తింటే కలిగే అధిక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు వివరిస్తున్నారు.

ఉదయం ఖాళీ కడుపుతో 4 ఖర్జూరాలు తినడం మొదలుపెడితే.. ఇవి సహజంగా శక్తిని పెంచడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఎముకలను బలపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరాల్లో ఐరన్, కాల్షియం, నేచురల్ షుగర్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అద్భుతమైన ఆహారం. అలాగే ఖర్జూరాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. శక్తిని పెంచడం, గుండె ఆరోగ్యాన్ని కాపాడటం, ఎముకలను బలోపేతం చేయడం, మెదడు పనితీరును మెరుగుపరచడం, మంటను తగ్గించడం వంటి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. వీటిలో ఉండే ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి అనేక పోషకాలను ఇస్తాయి.

Morning Magic Experts Tout Dates on Empty Stomach for Health Boost

అంతేకాక ఖర్జూరంలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి సాయపడుతుంది. ఖర్జూరాలు రక్తపోటును నియంత్రించడంలో సాయపడతాయి. అలాగే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇక ఖర్జూరాల్లో ఉండే పోషకాలు ఎముకలను బలోపేతం చేయడంలో సాయపడతాయి. అందువల్ల ఖాళీ కడుపుతో రోజుకు రెండు ఖర్జూరాలను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు వివరిస్తున్నారు. ఖర్జూరాలను రాత్రంతా నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

ఇక ఖర్జూరంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఐరన్, విటమిన్ సీ, విటమిన్ డీ తో పాటు విటమిన్ బీ కాంప్లెక్స్ కూడా ఉంటాయి. కనుక ఇది గర్భిణులకు మంచి ఆహారంగా చెప్తున్నారు వైద్యులు. అంతేకాక దీంట్లో ఉండే పోషకాలు మన జుట్టు, చర్మ సంరక్షణకు తోడ్పడతాయట. ఇక ఖర్జూరాల్లో ఉండే పీచు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి మలబద్ధకాన్ని నిరోధిస్తుంది. ఇందులో ఉండే పీచు రక్తంలో చక్కెర స్థాయిల్ని కూడా అదుపులో ఉంచుతుంది. పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ నిదానించి రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా చేస్తుందని వైద్యులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+