మౌత్​ వాష్ ఎక్కువగా​ వాడుతున్నారా..?

చాలామంది నోటి దుర్వాసన కారణంగా మౌత్ వాష్ లు వాడటం చేస్తుంటారు. రోజుకి రెండు సార్లు ఉదయం అలాగే రాత్రి పడుకునేముందు బ్రష్ చేసుకుంటే నోటి దుర్వాసన రాదని వైద్యులు చెబుతున్నాయి. కానీ చాలామంది అలా చేయకుండా మార్కెట్లో దొరికే మౌత్ వాష్ లను తీసుకొచ్చి వినియోగిస్తుంటారు. అయితే ఇవి వాడుతున్నవారు అలర్ట్ కావాల్సిందేనని నిపుణులు అంటున్నారు. లేదంటే.. క్యాన్సర్ తో పాటుగా మరికొన్ని అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

మౌత్ వాష్ కారణంగా నోరు పొడిబారడం జరుగుతుంది. మౌత్ వాష్ లోని ఆల్కహాల్ కారణంగా ఇది లాలాజలాన్ని తగ్గిస్తుంది. దానివల్ల నోటిలో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మన నోటిలో మంచి, చెడు రెండు బ్యాక్టీరియాలు ఉంటాయి. అయితే మౌత్ వాష్ వాడకం ద్వారా మంచి బ్యాక్టీరియాను తగ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

Mouthwash Warning Experts Link Excessive Use to Higher Cancer Risk

అలాగే రోజూ మౌత్ వాష్ వాడటం కారణంగా ఆ లిక్విడ్ లో ఉండే హానికర కెమికల్స్ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. అలాగే నిరంతరం వాడితే చిగుళ్ల సమస్యతోపాటు పేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే మౌత్‌ వాష్‌ లలో ఉండే కొన్ని రకాల కెమికల్స్‌ నోటి పుండ్లకు దారితీస్తాయని చెబుతున్నారు. దంతాల రంగు కూడా మారే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+