మునక్కాయ స్వీట్ కార్న్ కర్రీ.. పాలతో కలిపి వండితే నాలుకకు అమృతమే!
ఎప్పుడూ ఒకే విధమైన కూరలు వండుకు తింటే వంట కూడా బోరింగ్ గా అనిపిస్తుంది. అందుకే అప్పుడప్పుడు కాస్త వెరైటీ త్రి చెయ్యాలి. అలా వెరైటీగా రుచికరమైన, పోషకాలు నిండిన పాలు ఆధారిత కూర మునక్కాయ స్వీట్ కార్న్ కూర. మునక్కాయలో ఉండే పోషకాలు, స్వీట్ కార్న్ మంచి రుచి, పాలు క్రీమీ టెక్స్చర్ ఇచ్చి ఈ కూరను ప్రత్యేకం చేస్తాయి. రోటి, చపాతి, రైస్ లేదా అన్నంతో బాగుంటుంది.
కావాల్సిన పదార్థాలు
మునక్కాయలు (డ్రమ్ స్టిక్స్) – 4-5
స్వీట్ కార్న్ గింజలు – 1 కప్
పాలు – 1 కప్స్
ఉల్లిపాయలు – 2 (సన్నగా తరిగినవి)
టమాటాలు – 2 (సన్నగా తరిగినవి)
పచ్చి మిర్చి – 2-3
అల్లం-వెల్లులి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
పసుపు – 1/4 టీస్పూన్
కారం – 1 1/2 స్పూన్
జీలకర్ర – 1 టీస్పూన్
కొత్తిమీర – కొద్దిగా
నూనె – 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు – రుచికి తగినంత

తయారీ విధానం:
మునక్కాయలను 2-3 అంగుళాల ముక్కలుగా కట్ చేసి, బాగా కడిగి పక్కన పెట్టండి. స్వీట్ కార్న్ గింజలను కూడా కడిగి ఉంచండి. పాన్ లో నూనె వేడి చేసి, జీలకర్ర వేసి వేగనివ్వండి. తర్వాత తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం-వెల్లులి పేస్ట్, పచ్చి మిర్చి వేసి వాసన పోయేవరకు వేయించండి.
ఇలా వండితే మునక్కాయ స్వీట్ కార్న్ సూపర్ టేస్ట్
ఆ తర్వాత టమాటా ముక్కలు వేసి, పసుపు, ఉప్పు వేసి మెత్తగా మగ్గేలా ఉడికించండి. ఇప్పుడు మునక్కాయ ముక్కలు వేసి 2-3 నిమిషాలు కలిపి వేయించండి. తర్వాత స్వీట్ కార్న్ గింజలు వేసి మరో 2 నిమిషాలు ఉడికించండి. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి 5-6 నిమిషాలు మధ్య మంట మీద ఉడికించండి.
పాలతో కూరకు అసలైన రుచి
మునక్కాయలు, స్వీట్ కార్న్ ఉడికిన తర్వాత 1 కప్ పాలు పోయండి. మంటను మధ్యస్థంగా ఉంచి, కొద్దిగా ఉడకనిచ్చి కారం వేసి కలిపి కొద్దిసేపు ఉడికించి, కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చెయ్యండి. అంతే రుచికరమైన పాలతో వండిన మునక్కాయ, స్వీట్ కార్న్ కూర రెడీ అయ్యింది. దీనిని అన్నం, చపాతీ దేనిలో అయినా సర్వ్ చెయ్యొచ్చు.












Click it and Unblock the Notifications