ఎండాకాలంలో ఖర్బూజా తీసుకుంటున్నారా?
వేసవికాలంలో ఖర్చూజ పండు విరివిగా దొరుకుతుంది. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. దీంట్లో దాదాపు 92 శాతం నీరుండటంతో వేసవి తాపం తగ్గించుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. శరీరంలో వేడిని, అధిక రక్తపోటును తగ్గిస్తుంది. ఈ పండులో ఉన్న పోషక విలువలను తెలుసుకుందాం.
ఖర్బూజ పండులో ఉన్న విటమిన్ సి రోగనిరోధకశక్తిని పెంచుతుంది. బీటాకెరోటిన్ క్యాన్సర్ బారిన పడిన కణాలను తగ్గిస్తుంది. శరీరంలో తెల్ల రక్తకణాలు వృద్ధి చెందేలా చేసి రక్తంలో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా చూస్తుంది. విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. దీంతో కంటి సంబంధిత సమస్యలను దూరం చేసి కంటిచూపు బాగుండేలా చేస్తుంది. వడదెబ్బ నుంచి తప్పించుకోవడానికి ఖర్చూజ బాగా ఉపయోగపడుతుంది. ఈ పండులో విటమిన్ కె, విటమిన్ ఇ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ప్రత్యుత్పత్తి వ్యవస్థ మంచి పనితీరు కనపరచడంతో రక్తప్రసరణ బాగా జరుగుతుంది.

ఖర్బూజలో ఎక్కువ మోతాదులో పొటాషియం ఉంటుంది. ఇది గుండెకు న్యూట్రియన్స్ ను అందజేస్తుంది. అంతేకాకుండా ఫోలెట్ ఉండటంతో గుండె జబ్బుల నుంచి కాపాడుతుంది. తక్కువ కెలోరీస్ ఉండి పీచు ఎక్కువగా ఉండటంతో బరువును సులభంగా తగ్గొచ్చు. ఖర్బూజ జ్యూస్ తాగడంవల్ల మెదడుకు ఆక్సిజన్ సరఫరా బాగా జరుగుతుంది. ఒత్తిడి తగ్గి నిద్ర బాగా పడుతుంది. క్రమం తప్పకుండా దీన్ని తీసుకుంటుంటే రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. కిడ్నీలో రాళ్లను సైతం కరిగించడమే కాకుండా జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. ఈ పండులో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన గర్భిణులకు ఎంతో మేలు. అంతేకాకుండా బిడ్డ ఎదుగుదలకు బాగా తోడ్పడుతుంది.












Click it and Unblock the Notifications