నెల్లూరు స్టైల్ 'నెత్తళ్ల పులుసు'.. ఇలా చేస్తే గిన్నె మొత్తం ఊడ్చేస్తారు..!
చేపల కూర అనగానే చాలామందికి నోరూరుతుంది. ముఖ్యంగా తీర ప్రాంతాల ప్రజలు చేపలను ఎక్కువగా తింటారు. చేపలను ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా చేస్తుంటారు. ఆంధ్రా స్పెషల్, నెల్లూరు స్పెషల్, తెలంగాణ స్పెషల్ ఇలా ప్రాంతాన్ని బట్టి రుచి మారిపోతూ ఉంటుంది. అయితే నెల్లూరు స్టైల్ చేపల పులుసుకు ఉన్న క్రేజే వేరు.. ఈ చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. మరి నెల్లూరు స్టైల్ లో నెత్తళ్ల పులుసు ఎప్పుడైనా ట్రై చేశారా..? నెత్తళ్ల పులుసు ఇలా చేస్తే గిన్నె మొత్తం ఊడ్చేస్తారు. నెత్తళ్ల పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు.. తయారీ విధానం గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
నెత్తళ్ల చేపల పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే ముందుగా నెత్తళ్లు చిన్నవి 500 గ్రాములు, చింతపండు పెద్ద నిమ్మకాయ సైజంత, మామిడికాయ ముక్కలు ఒక కప్పు, ఉల్లిపాయలు రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి, టమాటోలు రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి, పచ్చిమిర్చి నాలుగు, మసాలా దినుసులు(పోపు కోసం) ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు(కొద్దిగా) తీసుకోవాలి, అలాగే పసుపు పావు టీ స్పూన్, కారం రెండు టీ స్పూన్ లు లేదా రుచికి తగినంత, ఉప్పు రుచికి తగినంత, కొత్తిమీర గార్నిష్ కోసం తీసుకోవాలి.

ఇప్పుడు నెత్తళ్ల పులుసు తయారీ విధానం చూస్తే ముందుగా ఒక గిన్నెలో నూనె వేడి చేసి పోపు దినుసులు వేసి చిటపటాలాడించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు టమాటో ముక్కలు, పసుపు, కారం, చింతపండు రసం, ఉప్పు, మామిడికాయ ముక్కలు వేసి ఉడికించుకోవాలి. పులుసు మరిగిన తర్వాత నెత్తళ్లు చేపలు వేసి తక్కువ మంటపై ఉడికించుకుని దింపేస్తే సరి.. చివరగా కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే చాలు.. సూపర్ టేస్టీ నెత్తళ్ల పులుసు రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications