సంగీతానికి మన బాడీ రియాక్ట్ అవ్వడానికి కారణం ఇదేనా..?
మనలో చాలా మందికి పాట విన్నప్పుడు తల ఊపడం, కాలు కదపడం లేదా చేతితో ట్యాప్ చేయడం సహజం. ఇది కేవలం అలవాటు కాదు — మన మెదడు సంగీత లయకు తాను సమకాలీనంగా కదులుతున్న సంకేతం. తాజాగా ప్రచురితమైన ఒక శాస్త్రీయ అధ్యయనం ప్రకారం, ధ్వని మన మెదడులోని అంతర్గత బీట్‌ను ప్రత్యేకంగా ప్రభావితం చేస్తుంది, కానీ స్పర్శ మాత్రం అలాంటి ప్రభావాన్ని చూపదు.
కొత్త అధ్యయనం వెనుక ఉద్దేశ్యం..
బెల్జియంలోని లూవైన్ క్యాథలిక్ విశ్వవిద్యాలయం (UCLouvain) పరిశోధకులు ఈ ఆసక్తికరమైన అధ్యయనాన్ని చేపట్టారు. ఈ పరిశోధనకు “Behavior-Relevant Periodized Neural Representation of Acoustic but Not Tactile Rhythm in Humans” అనే క్యాప్షన్ ఇచ్చారు. ఈ అధ్యయనం ప్రధానంగా రెండు విషయాల మధ్య వ్యత్యాసాన్ని వివరించింది.
-
శ్రవణం (Hearing) : సంగీత లయను మెదడు బాగా గ్రహిస్తుంది.
-
స్పర్శ (Touch) : అదే లయను స్పర్శ ద్వారా అనుభవించినప్పుడు మెదడు అదే విధంగా స్పందించదు.

పరిశోధకులు 45 మంది ఆరోగ్యవంతులైన పెద్దలను ఎంపిక చేసుకున్నారు. ఈ పరిశోధనలో వారికి రెండు రకాల లయలను వినిపించారు. ఒకటి శబ్దం ద్వారా (Auditory Rhythm), మరొకటి స్పర్శ ద్వారా (Tactile Rhythm). కాగా స్పర్శ ద్వారా లయను అందించడానికి వారి వేళ్లపై తేలికపాటి కంపనాలు కల్పించారు.ఈ సమయంలో వారు లయకు అనుగుణంగా వేళ్లతో ట్యాప్ చేశారట. వారి మెదడు కార్యకలాపాలను ఎలక్ట్రోఎన్సెఫలోగ్రఫీ (EEG) పద్ధతితో రికార్డ్ చేశారు. ఈ పద్ధతి ద్వారా మెదడు తరంగాలు నిజ సమయంలో (Real-Time) ఎలా మారుతున్నాయో పరిశీలించారు.
ధ్వనిని విన్నప్పుడు పాల్గొనేవారి మెదడు తక్కువ-ఫ్రీక్వెన్సీ తరంగాలను (Low-Frequency Brain Waves) ఉత్పత్తి చేసింది.ఈ తరంగాలు సంగీతంలోని బీట్‌లకు అచ్చం సరిపోయేలా కనిపించాయి. ఈ తరంగాల ఫ్రీక్వెన్సీ 15 Hz కంటే తక్కువగా ఉంటుంది.ఇవి మెదడులోని శ్రవణ ప్రాంతం (Auditory Cortex) మరియు మోటార్ ప్రాంతం (Motor Cortex) మధ్య సమన్వయాన్ని ఏర్పరుస్తాయి. దీని ఫలితంగా పాల్గొనేవారి ట్యాపింగ్ కచ్చితంగా, స్థిరంగా, లయబద్ధంగా జరిగింది.ఇది మన మెదడు శబ్దాన్ని “ఇంటర్నల్ మెట్రోనోమ్” గా మార్చగలదని సూచిస్తుంది.
స్పర్శ ద్వారా లయ..
అదే లయను స్పర్శ రూపంలో (వేళ్లపై కంపనాలుగా) ఇవ్వగా, మెదడు ప్రతి స్పర్శను ప్రత్యేక సంఘటనగా మాత్రమే ప్రాసెస్ చేసింది.అవి కలసి లయగా గుర్తించబడలేదు. ఈ సమయంలో EEG రికార్డింగ్స్‌లో 25 Hz వరకు ఉన్న వేగవంతమైన మెదడు ప్రతిస్పందనలు మాత్రమే కనిపించాయి.ఇవి కేవలం “తక్షణ స్పర్శ గుర్తింపు”కి సహాయపడతాయి. కానీ లయబద్ధమైన నిర్మాణం (Rhythmic Structure) ఏర్పరచవు. అందువల్ల పాల్గొనేవారి ట్యాపింగ్‌లో అస్థిరత కనిపించింది.మెదడులో “అంతర్గత బీట్” అనే భావన ఏర్పడలేదు.
శాస్త్రవేత్తలు దీనిని Multiscale Temporal Integration అని పిలుస్తారు. ఇది మనకు ఇతరులతో కలిసి పాడటానికి, నృత్యం చేయటానికి, చప్పట్లు కొట్టటానికి లేదా లయలో కదలడానికి సహాయపడుతుంది. అయితే స్పర్శ వ్యవస్థ మాత్రం ప్రతి కంపనాన్ని వేర్వేరుగా గుర్తిస్తుంది, అందువల్ల స్థిరమైన లయ నిర్మాణం సాధ్యం కాదు. ఈ ఫలితాలు కేవలం సంగీతాన్ని అర్థం చేసుకోవడంలోనే కాదు, నాడీ సంబంధిత రుగ్మతల చికిత్సలో కూడా ఉపయోగపడవచ్చు.
-
హోటల్ స్టైల్ "చికెన్ ఫ్రైడ్ రైస్" ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలంటే..? -
ఇక ఒక్క మిస్డ్ కాల్‌తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!!












Click it and Unblock the Notifications