న్యూ ఇయర్ స్పెషల్​ కేక్.. ఇలా ఈజీగా తయారు చేసుకోండి..!

న్యూ ఇయర్ వచ్చేస్తోంది. ఈ సీజన్ లో కేక్ లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. కేక్ లను చిన్న పిల్లలూ, పెద్దలూ ఇష్టంగా తింటారు. మరి ఈ సారి బేకరీ నుంచి తెచ్చుకోవడం కాకుండా ఇంట్లోనే బేకరీ స్టైల్ స్పాంజ్ కేక్ తయారీ చేసుకోవచ్చు. ఈ స్పాంజ్ కేక్ ను ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి..? స్పాంజ్ కేక్ తయారీకి ఏ ఏ పదార్థాలు కావాలి..?

స్పాంజ్ కేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. గుడ్లు నాలుగు, మైదా పిండి 130 గ్రాములు, చక్కెర 150 గ్రాములు, వెనీలా ఎక్స్ ట్రాక్ట్ ఒక టీ స్పూన్, బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్, ఉప్పు చిటికెడు, నూనె 50 గ్రాములు తీసుకోవాలి.

ఇక బేకరీ స్టైల్ స్పాంజ్ కేక్ తయారీ విధానం చూస్తే.. ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకుని అందులో ఎగ్స్ పగులకొట్టి వేయాలి. ఇందులోనే పంచదార వేసుకుని హ్యాండ్ బ్లెండర్ సాయంతో లైట్ క్రీమ్ కలర్ వచ్చేంత వరకూ వేగంగా బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత వెనీలా ఎక్స్ ట్రాక్ట్ వేసుకుని మరోసారి బీట్ చేయాలి. ఆ మిశ్రమంపైన నురగలు వచ్చేంత వరకూ హ్యాండ్ బ్లెండర్ తో బీట్ చేయాలి. ఆ తర్వాత బేకింగ్ పౌడర్, మైదా పిండిని ఓ జల్లెడలోకి తీసుకుని ఓ గిన్నెలోకి జల్లించుకోవాలి.

New Year s Special Easy Vanilla Sponge Cake Recipe at Home

ఇప్పుడు పిండిని గరిటెతోని బాగా కలపాలి. అందులో నూనె, ఉప్పు వేసి హ్యాండ్ బ్లెండర్ సాయంతో బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత మిశ్రమాన్ని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కేక్ పాన్ లో నెయ్యితో గ్రీస్ చేయండి. ఆపైన పాన్ లో బటర్ పేపర్ వేయాలి. ఇందులో బీట్ చేసుకున్న మిశ్రమాన్ని పూర్తిగా వేసుకోవాలి. ఇప్పుడు ఓవెన్ ను హీట్ చేసి 150 డిగ్రీల వద్ద దాదాపు 30 నిమిషాలపాటు బేక్ చేసుకోవాలి. ఆ తర్వాత కేక్ పాన్ ఓవెన్ నుంచి బయటకు తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత కేక్ ను డీ మౌల్డింగ్ చేసి ఓ ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు మీకు నచ్చిన సైజులో కేక్ ను కట్ చేసుకుంటే సరిపోతుంది. టేస్టీ వెనీలా స్పాంజ్​ కేక్ రెడీ అయినట్టే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+