Cucumber: కీరదోసకాయ తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!
ఎండా కాలం వచ్చిందంటే మనం ఎక్కువగా తినాల్సిన వాటిలో కీరదోస ఒక్కటి. కీరదోస వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరం డిహైడ్రెషన్ కాదు. కీర దోసకాయ తినడంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ కీర దోసకాయ అనేక పోషకాలను కలిగి ఉంటాయి. కీర దోస తింటే శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరుగుతుంది.
కీరదోసలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి, మలబద్ధక సమస్య రాకుండా చేస్తోంది. అలాగే మన శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్లను కూడా బయటకు పంపిస్తుంది. కీర దోసలో విటమిన్ కె విటమిన్ ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందించడంలోనూ, ఎముకలు పటుత్వాన్ని కోల్పోకుండా కాపాడటంలోనూ ఉపయోగపడుతుంది. కీరదోసకాయలో లారిసెరిసినాల్, పినోరేసినాల్, సెకోయుసోరిసినాల్, అనే లిగ్నన్లు అండాశయ, గర్భాశయ ప్రోస్ట్రేట్ క్యాన్సర్లను నివారించడంలో సహాయపడతాయి.

కీరదోసలో ఉండే విటమిన్లు బ్లడ్ ప్రెజర్‌ను తగ్గించి.. రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తాయి. దీనిలో ఉండే విటమిన్ 'బి'తలనొప్పిని వెంటనే తగ్గించి ప్రశాంతంగా ఉండేలా ఉపయోగపడుతుంది. కీర దోసను జ్యూస్‌గా చేసుకుని తాగడం వల్ల కడుపులో పుండ్లు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా వేసవిలో కీరదోసను తీసుకోవడం వల్ల దాహం తక్కువగా ఉంటుంది. కీరదోస ముక్కలుగా చేసి కళ్లపై ఉంచుకోవడం వల్ల కళ్ల మంటలు, ఎరుపులు తగ్గి, కళ్లు కాంతివంతంగా కనిపిస్తాయి.












Click it and Unblock the Notifications