అవిసె గింజలతో ఎన్నో ప్రయోజనాలు- వీరు దూరంగా ఉండాల్సిందే.!!
ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు అవసరం. పోషకాలు అందించటంలో అవిసె గింజలు ఎంత గానో ఉపకరిస్తాయి. అవిసె గింజలను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలు కలుగుతాయి. కాగా, వీటిని తీసుకోవటంలో మాత్రం పరిమితి అవసరం. కొన్ని ఆరోగ్య సమస్యలతో ఉన్నవారు వీటికి దూరంగా ఉంటేనే మంచింది. అయితే, అవిస గింజెలు ఎంత పరిమాణంలో తీసుకోవాలి..ఏ సమయంలో తీసుకోవాలనేది నిపుణులు సూచనలు చేస్తున్నారు.
అవిస గింజలు అనేక రకాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే ఈ గింజలను రోజుకు 2 టేబుల్ స్పూన్ల మోతాదులో లేదా 20 గ్రాముల వరకు తినవచ్చు. ఈ విత్తనాలను ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో లేదా సాయంత్రం స్నాక్స్ రూపంలోనూ తినవచ్చు. ఇలా ఈ గింజలను తింటే అనేక లాభాలను పొందవచ్చు. అవిసె గింజలలో ఒమెగా3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఆల్ఫా లినోలినిక్ యాసిడ్ కూడా అధికంగానే ఉంటుంది. ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. రక్త నాళాల వాపులను తగ్గిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది చాలా నెమ్మదిగా జీర్ణం అవుతుంది. అందువల్ల షుగర్, కొలెస్ట్రాల్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి.

ఈ గింజల్లో ఉండే ఫైబర్ కారణంగా మలబద్దకం తగ్గుతుంది. ఈ గింజల్లో ఫైబర్ అధికంగా ఉన్న కారణంగా వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి. దీంతో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. అధిక బరువు తగ్గాలనుకుంటున్న వారు రోజూ అవిసె గింజలను తింటుంటే ఎంతగానో ఫలితం లభిస్తుంది. అవిసె గింజల్లో లిగ్నన్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. దీంతో క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. అవిసె గింజలను అధికంగా తింటే మలబద్దకం ఏర్పడే ప్రమాదం ఉంటుంది. కనీసం 6 నుంచి 8 గంటల పాటు నానబెట్టాల్సి ఉంటుంది. రక్తాన్ని పలుచగా చేసే మందులను వాడేవారు అవిసె గింజలను తినేముందు డాక్టర్‌ను సంప్రదించిన తరువాతనే వినియోగించాలి.












Click it and Unblock the Notifications