రోజూ ఒక కప్పు ఇవి తీసుకుంటే.. షుగర్ సహా ఈ సమస్యలకు చెక్ర్..!!
మారుతున్న కాలంలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండానే మధుమేహం వెంటాడుతోంది. ఒత్తిడి.. క్రమం తప్పుతున్న జీవనశైలి.. ఆహారంలో మార్పులతో అనారోగ్య సమస్యలు తప్పటం లేదు. దీంతో.. లైఫ్ స్టైల్ తో పాటుగా తీసుకునే ఆహారంలో జాగ్రత్త ల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అందులో భాగంగా ప్రతీ రోజు ఓట్స్ ను ఒక కప్పు తీసుకోవటం తో షుగరు తో సహా పలు సమస్యలకు చెక్ పెట్టవచ్చని.. అయితే, పరిమితి మేరకే తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఓట్స్ వినియోగం ఈ మధ్య కాలంలో పెరిగింది. దీనిలో బీటా-గ్లూకాన్ అనే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీరు బ్రేక్ ఫాస్ట్ గా కూడా తీసుకోవచ్చు. ఇంకా ఈ ఫుడ్ నెమ్మదిగా జిర్ణం చేసి రక్తంలో షుగర్ పెరగకుండా ఇది సహాయపడుతుంది. ఓట్స్ ప్రతీ రోజు ఒక కప్పు తీసుకోవటం ద్వారా శరీరంలో కొత్త మార్పులు వస్తాయి. అయితే, ఉదయం లేదా సాయత్రం తీసుకున్నా సరిపోతోంది. రోజులో రెండు కప్పుల మించి వీటిని తీసుకోకండి. మీరు ఎంత తినాలకుంటే అంత వరకే దీనిని తినండి. ఇతర అనారోగ్య సమస్యలు ఉంటే దీనిని మితంగానే దీనిని తీసుకోవాలి. షుగరు బాధితులు మందులు తీసుకుంటేనే ఓట్స్ తీసుకోవచ్చని.. పరిమితి మేరకే ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీరికి ఒక గ్లాస్ పాలు తీసుకుని దానిలో వీటిని ఉడికించి తీసుకోవాలని.. పంచదార వేయద్దని చెబుతున్నారు.

నిపుణుల సూచనలు
కాగా, షుగరు ట్రీట్మెంట్ లో ఉన్న వారు ఓట్స్ లో దాల్చినచెక్క పొడి, డ్రైఫ్రూట్స్, ఇంకా వేరే గింజలు వేసి మంచిగా మిక్స్ అయ్యేలా చేసుకోవటం ద్వారా రుచిగా ఉంటుందని వెల్లడిస్తున్నారు. అదే విధంగా ఓట్స్‌ను ఒట్టిగా కాకుండా గుడ్లు, పెరుగు (గ్రీక్ యోగర్ట్), బాదం, వాల్నట్స్, చియా విత్తనాలు లేదా అవిసె గింజలతో కలిపి తింటే షుగర్ నియంత్రణలో ఉంటుందని చెబుతున్నారు. కాగా, ప్రత్యేకంగా ఓట్స్ రక్తంలో చక్కెర నియంత్రణకు ఇది హెల్ప్ చేస్తుంది. ఇది తింటే ఎక్కువసేపు ఆకలి కానివ్వకుండా చేస్తుంది. అలాగే, బాడీలో ఉన్న అవరసరం లేని కొలెస్ట్రాల్ ను కూడా ఇది తగ్గిస్తుంది. అధిక బరువును తగ్గించడంలో ఇది కీలక పాత్ర వహిస్తుంది. జీర్ణక్రియ పనితీరుకు కూడా మెరుగుపరుస్తుంది. క్రమం తప్పకుండా ఓట్స్ తీసుకోవడం వల్ల శరీరం ఇన్సులిన్‌కు మెరుగ్గా స్పందిస్తుంది. ఓట్స్‌లో ఉండే కరిగే ఫైబర్ (బీటా-గ్లూకాన్) రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా అడ్డుకుంటుంది. అయితే.. షుగరు చికిత్స తీసుకుంటున్న వారు వైద్యుల సలహాల మేరకు ఆరోగ్యంలో మార్పులు చేసుకోవటం మంచిది.













Click it and Unblock the Notifications
