ఊబకాయానికి కీళ్ళ నొప్పులకు లింక్.. ఇలా చేస్తేనే రిలీఫ్ !

ఊబకాయం మరియు కీళ్ల నొప్పుల మధ్య సంబంధం ఉంది. నగర జీవనం పెరుగుతున్న కొద్దీ మారుతున్న జీవనశైలి అలవాట్లు చాలామందిని ఊబకాయ బాధితులుగా మారుస్తున్నాయి. ఈ పరిస్థితి కీళ్ల నొప్పులకు దారితీస్తోంది. ఇది సాధారణ రోజువారీ పనులను కూడా కష్టం చేస్తోంది. దీనిపై సరైన అవగాహన పెంచుకోవడంతో పాటు, నివారణ చర్యలు తీసుకోవడం చాలా అవసరమని వైద్యులు చెబుతున్నారు.

ఊబకాయానికి కీళ్ళ నొప్పులకు లింక్

నగరాల్లో జీవనం అంటే సాధారణంగా ఎక్కువ కదలిక లేని అలవాట్లు, అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం సాధారణమైపోయింది. ఫాస్ట్ ఫుడ్ వినియోగం బాగా పెరగడం వల్ల చాలామంది ఊబకాయ బాధితులుగా మారుతున్నారు. శారీరక శ్రమ లేకపోవడం కూడా ఈ సమస్యను మరింత పెంచుతుంది. ఎప్పుడైతే ఊబకాయం ఇబ్బంది పెడుతుందో అప్పుడు, దానితోపాటు వచ్చే కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిల్లో కీళ్లనొప్పులు ఒకటి.

Obesity Is Linked To Joint Pain This Is The Only Way To Get Relief

అధిక బరువుతో కీళ్ళ నొప్పులు

అధిక బరువు వల్ల కీళ్లపై, ముఖ్యంగా మోకాళ్ళు, నడుము కీళ్లపై చాలా ఒత్తిడి పడుతుంది. ఇది నొప్పిని కలిగించడమే కాకుండా, కదలడానికి కూడా కష్టంగా మారుస్తుంది. ఇక ఇటువంటి సమయంలో కొద్దిగా బరువు తగ్గినా కూడా కీళ్లపై భారాన్ని చాలా వరకు తగ్గించవచ్చని వైద్యులు చెబుతున్నారు. బరువును నియంత్రణలో ఉంచుకోవడానికి క్రమం తప్పని వ్యాయామం, సమతుల్య ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఇలా చేస్తే కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం

స్థూలకాయం వల్ల వచ్చే కీళ్ల నొప్పులను తగ్గించుకోవడానికి నిపుణులు జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. నడక లేదా సైక్లింగ్ వంటివి చెయ్యాలని, శారీరక శ్రమతో ఆరోగ్యంగా ఉండాలని చెబుతున్నారు. పండ్లు, కూరగాయలు మరియు సంపూర్ణ ధాన్యాలతో సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకోవడం బరువును అదుపులో ఉంచుకోవడానికి సహాయపడుతుందని అంటున్నారు.

సమస్య పరిష్కారానికి ఇలా చెయ్యాల్సిందే

ముఖ్యంగా నగరాల్లో ఊబకాయం మరియు కీళ్ల నొప్పుల మధ్య ఉన్న సంబంధం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సమస్యను పరిష్కరించాలంటే, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం, ప్రజల్లో అవగాహన పెంచడం చాలా అవసరం. కీళ్ల నొప్పులతో బాధపడేవారు, నొప్పి నివారణకు మందులను వాడడం మాత్రమే కాకుండా, బరువు తగ్గడానికి ప్రయత్నించాలి. ఎప్పుడైతే బరువు తగ్గుతారో అప్పుడు వారు కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం పొందుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+