ప్రతిరోజు ఒక స్పూన్ వెన్న తీసుకోండి..
వెన్నలో ఎన్నో పోషకాలుంటాయని పోషకాహార నిపుణులు తరుచుగా చెబుతుంటారు. ప్రతిరోజు ఒక చెంచా వెన్న తీసుకోవడంవల్ల అనేక సమస్యలు పరిష్కారమై సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బి 12 పుష్కలంగా లభిస్తాయి. కాల్షియం కూడా అధికంగా ఉంటుంది. ఎముకల బలానికి, దంతాలు బలంగా పెరిగేందుకు ఇది తోడ్పడుతుంది. అసలు ప్రతిరోజు ఒక చెంచా వెన్న తీసుకోవడంవల్ల కలిగే లాభాలు తెలుసుకుందాం.
విటమిన్ ఏ, విటమిన్ ఇ, విటమిన్ డి, విటమిన్ కె వెన్నలో పుష్కలంగా ఉంటాయి. చర్మం, జట్టు ఆరోగ్యంగా ఉంటాయి. వెంట్రుకలు బలంగా అవుతాయి. చర్మాన్ని తేమగా ఉంచుతుంది. మలబద్ధకాన్ని నివారించడంలో వెన్నది ప్రముఖ పాత్ర. ప్రతిరోజు పరగడుపునే వెన్న తీసుకోవడంవల్ల మలబద్దకం లాంటి జీర్ణాశయ సమస్యలు దూరమవుతాయి. చర్మ సంరక్షణకు ఉపయోగపడుతుంది. ముఖంపై వెన్న రాసుకుంటే నల్లటి మచ్చలు తొలగిపోతాయి. పగిలిన పెదాలకు ప్రతిరోజు కొద్దిగా వెన్నను రాయడంవల్ల పగుళ్లు తగ్గుతాయి. అవి మృదువుగా మారతాయి.

మహిళలకు పీరియడ్స్ సమయంలో విపరీతమైన కడుపునొప్పి, తిమ్మిరి వస్తుంది. అప్పుడు వెన్నను తీసుకోవడంల్ల వాటినుంచి ఉపశమనం లభిస్తుంది. పాలిచ్చే తల్లులు కూడా ప్రతిరోజు కొద్ది వెన్నతినడం అలవాటు చేసుకోవాలి. పాల ఉత్పత్తిని పెంచుతుంది. పిల్లలకు వెన్న పెట్టడంవల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఈ తరహా సమస్యలన్నింటికీ చెంచా వెన్ను పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ ఏ పుష్కలంగా లభించే వెన్నను ప్రతిరోజు తీసుకోవడంవల్ల చర్మంతోపాటు జట్టుకు సంపూర్ణమైన ఆరోగ్యం లభిస్తుంది.












Click it and Unblock the Notifications