ఉల్లిపాయ టీ తాగండి... అదిరిపోతారు

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని ఒక సామెత ఉంది. మంచి ఆరోగ్యానికి ఉల్లిపాయ ఎంత మేలు చేస్తుందనేదానికి ఇది ఒక ఉదాహరణ. ప్రస్తుత రోజుల్లో ఎక్కువ సమయం కూర్చొని పనిచేయడం.. అందుకు తగినట్లుగా వ్యాయామం చేయకపోవడంతో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. గుండె జబ్బుల బారిన పడే అవకాశాలున్నాయి. ఇటువంటి సమస్యలను ఉల్లిపాయ టీతో నివారించవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఆ టీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసి, అందులో ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి వేయాలి. తర్వాత అందులో ఒక యాలుక్కాయ, దంచిన మిరియాలు రెండు, సోంపు గింజలు అర టీ స్పూన్ వేసి 5 నుంచి 8 నిముషాల సమయం మరిగించాలి. దీన్ని గోరువెచ్చగా అయ్యేంతవరకు అలాగే ఉంచి ఆ తర్వాత వడకట్టి గ్లాస్ లోకి తీసుకోవాలి. నిమ్మరసం, తేనె కలిపి దీన్ని తీసుకోవడంవల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ వేగంగా కరిగిపోతుంది.

onion tea health benefits and uses

ఉల్లిపాయ టీని తాగడంవల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. రక్తనాళాల్లో ఉండే అడ్డంకులన్నీ తొలగిపోవడంతోపాటు వాటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు శరీరంలో అధికంగా ఉన్నవారు దీన్ని తాగడంవల్ల మంచి ఫలితం ఉంటుంది. గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. జుట్టుకూడా బాగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+