పాలకూర పప్పు ఇలా చేస్తే ఆ టేస్ట్ వేరబ్బా..!

పప్పు అనేది తెలుగు రాష్ట్రాల్లో తరతరాలుగా కాకుండా దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన సాంప్రదాయ వంటకం. పప్పులో పలు రకాల వెరైటీలు ఉండగా.. వాటిలో ఒక రకం పాలకూర పప్పు. పాలకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఐరన్, కాల్షియం, ప్రొటీన్‌లతో పాటు శరీరానికి అవసరమైన అనేక పోషకాలు ఇందులో సమృద్ధిగా ఉంటాయి. సాదాసీదా పదార్థాలతో తయారవుతూనే, అత్యద్భుతమైన రుచిని అందించే ఈ వంటకం కుటుంబంలో చిన్నవారికి, పెద్దవారికి సమానంగా ఇష్టమవుతుంది.

అయితే కొందరు దీన్ని తినడానికి ఇష్టపడరు. ముఖ్యంగా పిల్లలు పాలకూర వంటకాలు అనగానే మొహం చిట్లించడం సహజమే. అలాంటి వారికోసం ఆంధ్ర స్టైల్‌లో రుచికరమైన "పాలకూర పప్పు"ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాలతో గనుక పాలకూర పప్పు చేస్తే ఆ టేస్టే వేరని గ్యారంటీగా అంటారు. వేడివేడిగా అన్నంలో ఈ పాలకూర పప్పు పోసుకుని.. కొంచెం నెయ్యి వేసుకొని తింటే... ఆ రుచికి సాటిలేదని అంటారు. తయారీ విధానం ఎలానో మీకోసం ప్రత్యేకంగా..

palakura-pappu-making-recipe-in-telugu-with-easy-tips

కావాల్సిన పదార్థాలు..

  • కందిపప్పు - 1 కప్పు
  • పసుపు - ¼ టీస్పూన్
  • నూనె (పప్పు ఉడికించడానికి) - 2 టీస్పూన్లు
  • కరివేపాకు - కొద్దిగా
  • తరిగిన పాలకూర - 2 కప్పులు
  • వంట నూనె - 2 టేబుల్ స్పూన్లు
  • వెల్లుల్లి రెబ్బలు - 5-6
  • ఆవాలు - ½ టీస్పూన్
  • జీలకర్ర - ½ టీస్పూన్
  • ఎండుమిర్చి - 2
  • పచ్చిమిర్చి - 3
  • ఉల్లిపాయ (మీడియం సైజు) - 1
  • ఉప్పు - తగినంత
  • ధనియాల పొడి - 1 టీస్పూన్
  • కారం - 1 టీస్పూన్
  • చింతపండు - చిన్న నిమ్మకాయంత

తయారీ విధానం..

ముందుగా కందిపప్పును కుక్కర్‌లో శుభ్రంగా కడిగి, రెండు కప్పుల నీళ్లు పోసి అరగంట నానబెట్టండి. చింతపండును కూడా కడిగి నీటిలో నానబెట్టండి. ఈలోగా, పాలకూరను సన్నగా తరిగి, శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి.

నానిన పప్పులో పసుపు, రెండు టీస్పూన్ల నూనె, కరివేపాకు వేసి కుక్కర్ మూతపెట్టి 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి.

కుక్కర్ చల్లారిన తర్వాత, పప్పు ఉడికిందో లేదో చూసి, అవసరమైతే మరికొన్ని నీళ్లు కలిపి 1-2 విజిల్స్ రానివ్వండి.

పప్పు చక్కగా ఉడికిన తర్వాత, పప్పుగుత్తితో పూర్తిగా మెత్తగా కాకుండా, పలుకులు ఉండేలా మెదపాలి. ఆపై ఒక కప్పు నీళ్లు కలిపి పక్కన పెట్టుకోండి. ఇలా పప్పును వంటకు సిద్ధం చేసుకోవాలి.

ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి, రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయండి. నూనె కాలగానే, తరిగిన వెల్లుల్లి ముక్కలు వేసి, పచ్చి వాసన పోయే వరకు వేయించండి.

తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి దోరగా వేయించుకోండి.

అనంతరం తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి అవి మెత్తబడే వరకు మగ్గించండి. ఉల్లిపాయలు మగ్గగానే, రుచికి తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి తక్కువ మంటపై బాగా కలపాలి.

చివరగా, సిద్ధం చేసుకున్న పాలకూర తరుగును కలిపి, 2-3 నిమిషాల పాటు నూనెలో మగ్గనివ్వండి.

పాలకూర మగ్గిన తర్వాత, ఉడికించి మెదిపి పెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని అందులో కలపాలి.

అదనంగా మరో కప్పు నీళ్లు, నానబెట్టిన చింతపండు నుంచి తీసిన పావు కప్పు చిక్కటి రసం వేసి బాగా కలపండి.

ఇప్పుడు ఈ పప్పును మీడియం మంటపై 5-10 నిమిషాలు మరిగించాలి.

పప్పు చక్కగా ఉడికి, రుచులు కలిసిన తర్వాత స్టవ్‌ను ఆపివేయండి.

అంతే రుచికరమైన "పాలకూర పప్పు" మీకోసం రెడీగా ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+