తాటి ముంజలను తింటే ఏమవుతుందో తెలుసా?
మనకు కల్తీ లేకుండా లభించేది తాటి ముంజలొక్కటేనని, వాటిని తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
వేసవి దాహార్తిని తీర్చుకోవడానికి సహజ సిద్ధంగా ప్రకృతి ప్రసాదించిన వరం తాటి ముంజలు. వీటినే ఐస్ యాపిల్స్ అంటుంటారు. వేసవి కాలంలో మాత్రమే ఇవి లభిస్తాయి. విటమిన్లు, కేలరీలు అధికంగా ఉండే వీటిని తీసుకోవడంవల్ల శరీరానికి చలువ చేస్తాయి. వీటిని వేసవిలో తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. కల్తీ లేకుండా మనకు లభించేవి ఇవొక్కటేనని, కాబట్టి వీటిని తప్పకుండా తినాలని చెబుతున్నారు. ఏ, బీ, సీ విటమిన్లతోపాటు పొటాషియం, ఐరన్, జింక్, ఫాస్సరస్ వంటి పోషకాలు శరీరానికి అందుతాయి.
తాటి ముంజలతో కలిగే లాభాలు

ముఖంపై మొటిమల నుంచి ఉపశమనం పొందాలంటే తాటి ముంజలను తినాలి.
రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
ఎముకలను ధృఢంగా చేస్తాయి.
కొవ్వును కరిగిస్తాయి. శరీర బరువును తగ్గించడంలో తోడ్పడతాయి.
రోగ నిరోధకశక్తిని పెంచడమే కాకుండా శరీరానికి చల్లదనాన్నిస్తాయి.
మనిషి శరీరంలోని ఉష్ణోగ్రతలు తగ్గి జీర్ణక్రియ బాగా జరుగుతుంది.
కాలేయ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
శరీరంలో ఉండే విష పదార్ధాలను తొలగించడంలో దోహదపడటంతోపాటు కేన్సర్ కణాల నిరోధానికి బాగా ఉపయోగపడతాయి.

ట్యూమర్, బ్రెస్ట్ కేన్సర్ కణాలను అభివృద్ధి చేసే పెట్రో కెమికల్స్, ఆంథోసైనిన్ లాంటి వాటిని ముంజలు నిర్మూలిస్తాయి.
శరీరానికి కావాల్సిన మినరల్స్, న్యూట్రిన్లను సమతూకం చేస్తుంది.
శరీరంలో గ్లూకోజ్ స్థాయిని పెంచడంలో తోడ్పడతాయి.












Click it and Unblock the Notifications