Health News: వామ్మె, ఆ వంటనూనెతో అన్ని సమస్యలా..? మీరు వాడే నూనె సురక్షితమేనా చెక్ చేసుకోండి

Edible Oils: రోజువారీ ఆహారంలో వంటనూనెల పాత్ర అత్యంతం కీలకం. దాదాపు ప్రతి వంటకంలోనూ నూనె వినియోగం తప్పనిసరి. అంత ప్రాముఖ్యత కలిగిన వంటనూనెలు సురక్షితమేనా అని ఎప్పుడైనా ఆలోచించారా? ఫేమస్ బ్రాండ్‌లుగా మార్కెట్లో చలామణీ అవుతున్న నూనెలు ఆరోగ్యానికి ఎంత చేటు చేస్తాయో తెలిస్తే షాక్ అవ్వక తప్పదు. నూనెల వాడకం విషయంలో వినియోగదారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

అయితే భారతీయ వంటనూనె మార్కెట్‌లో సింహభాగం దిగుమతి చేసుకున్న వాటిదే. మలేషియాలో లీటరు పామాయిల్ దాదాపు 20-22కే లభిస్తోంది. ఇదికాస్తా ఆవాలు మరియు కొబ్బరి వంటి స్థానిక నూనెల ధరలను బలహీనపరుస్తుంది. వీటి ధర లీటరుకు 40-60గా ఉంటుంది. తద్వారా భారతీయ రైతులు మలేషియా కర్షకులతో పోటీపడటం కష్టతరం అవుతుంది. దీంతో పామాయిల్ వినియోగం వల్ల ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వాటి దిగుమతులపై ఆధారపడటం పెరుగుతూనే ఉంది.

Palm oil causes massive heart problems

పామాయిల్ అధిక ట్రాన్స్ ఫ్యాట్ కంటెంట్ కలిగి ఉన్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. క్రమం తప్పకుండా పామాయిల్ వాడకం.. గుండెపోటు మరియు స్ట్రోక్స్ వంటి హృదయ సంబంధ సమస్యలకు దారితీస్తుందని పరిశోధనలు ధ్రువీకరించాయి. ఇక దీన్ని ఇతర నూనెలతో కలిపి వాడితే ఆరోగ్య ప్రమాదాలు మరింత పెరుగుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇండియాలో పామాయిల్ వినియోగం అధికం కావడంతో చాలా కుటుంబాలను ప్రభావితం చేస్తుందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆనారోగ్యానికి కారణమవుతున్న పామాయిల్‌కు ప్రత్యామ్నాయంగా ఆవాలు, వేరుశెనగ మరియు కొబ్బరి వంటి ఆరోగ్యకరమైన స్థానిక నూనెలను వినియోగించవచ్చు. వీటిలో ప్రోటీన్లతో పాటు పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వాటి ప్రత్యేక రుచి గురించి కొన్ని ఆందోళనలు ఉన్నప్పటికీ, ఈ లక్షణాలు వాటి పోషక విలువలను పెంచేందుకు దోహదం చేస్తాయి. ఈ సహజ నూనెలను ఉపయోగించడం ఆరోగ్యానికి శ్రేయస్కరం. ఈ తరహా ఆహారపు అలవాట్లతో అనారోగ్య సమస్యలకు చెక్ పట్టడమే కాకుండా మన ప్రియమైనవారి శ్రేయస్సుకు కారణం కావచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+