ముంబై స్ట్రీట్ ఫుడ్ 'పావ్ బాజీ'.. ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేయండి..!
ముంబై అనగానే చాలా మందికి అక్కడి స్ట్రీట్ ఫుడ్ పావ్ బాజీ గుర్తుకు వస్తుంది. పావ్ బాజీ తక్కువ ధరకే సూపర్ టేస్ట్ ను అందిస్తూ ముంబైలోని మధ్య తరగతి ప్రజల ఆకలిని తీరుస్తోంది. అయితే నార్త్ ఇండియా వంటకాన్ని సౌత్ లోనూ చాలామంది ఇష్టపడుతుంటారు. కానీ ఇంట్లో ఎలా చేసుకోవాలో తెలియదు. ఇప్పుడు ఈజీగా ఈ ముంబై స్ట్రీట్ ఫుడ్ ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అందుకు కావాల్సిన పదార్థాలు ఏంటి..? పావ్ బాజీని ఎలా తయారు చేసుకోవాలి..? పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం..
'పావ్ బాజీ' తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే కూరగాయలు(బంగాళా దుంపలు, క్యారెట్, బఠానీ), పావ్ బాజీ మసాలా రెండు టేబుల్ స్పూన్ లు, వెన్న మూడు టేబుల్ స్పూన్ లు, ఉల్లిపాయలు చిన్నవి ఒకటి సన్నగా తరిగినవి, టమాటోలు రెండు కట్ చేసినవి, క్యాప్సికం ఒకటి చిన్నగా తరిగినది, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్, కారంపొడి ఒక టేబుల్ స్పూన్, పసుపు పొడి అర టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడా, పాన్ బన్స్ నాలుగు నుంచి ఆరు, కొత్తిమీర కొద్దిగా తీసుకోవాలి.

ఇప్పుడు పావ్ బాజీ తయారీ విధానం చూస్తే ముందుగా కూరగాయలను మెత్తగా ఉడకబెట్టి మ్యాష్ చేసుకోవాలి. ఆ తర్వాత బాండీలో వెన్న వేడి చేసి ఉల్లిపాయలు, క్యాప్సికం, పేస్ట్ వేయించాలి. ఆ తర్వాత టమాటోలు, కారం, పసుపు, పావ్ బాజీ, మసాలా వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికించిన కూరగాయల మిశ్రమాన్ని వేసి, కొద్దిగా నీరు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర, నిమ్మరసం కలిపి పావ్ బన్స్ ను వెన్నతో వేడి చేసి వడ్డించాలి. అంతే సూపర్ టేస్టీ పావ్ బాజీ రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications