సూపర్ టేస్టీ 'పీతల పులుసు'.. తింటే అస్సలు వదిలిపెట్టరు..!
తీర ప్రాంతంలో వండే వంటలు చాలా టేస్టీగా ఉంటాయి. తీర ప్రాంత ప్రజలు ఆదివారం వచ్చిందంటే చాలు చేపలు, పీతలతో వంటలు చేసుకుంటారు. కొంచెం డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు కానీ పీతలను తెచ్చుకుని తినాలని భావిస్తుంటారు. అయితే ఈజీగా పీతల పులుసు ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం..
పీతల పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. శుభ్రం చేసిన పీతలు ఒక కేజీ, చింతపండు రసం ఒక కప్పు, ఉల్లిపాయలు పెద్దవి రెండు, టమాటోలు రెండు పెద్దవి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి నాలుగు నుంచి ఐదు, పసుపు అర టేబుల్ స్పూన్, కారం రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ లు, ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి అర టేబుల్ స్పూన్, నూనె నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ లు తీసుకోవాలి.

పీతల పులుసు తయారీ విధానం చూస్తే.. ముందుగా శుభ్రం చేసిన పీతలను కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో నూనె వేడి చేసి అందులో పోపు గింజలు, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అదే మిశ్రమంలో అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ముక్కలు, మసాలా పొడులు, ఉప్పు వేసి మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు పీతల ముక్కలు వేయాలి. అందులోనే చింతపండు రసం, తగినంత నీరు పోయాలి. కొద్దిసేపు మరిగిన తర్వాత అందులో మసాలా పొడిని చల్లుకోవాలి. ఇక చివరగా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే సూపర్ టేస్టీ పీతల పులుసు రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications