వాటర్ క్యాన్లలో మంచినీళ్లు తాగుతున్నారా? అయితే కష్టమే!
ప్లాస్టిక్ ఆరోగ్యానికి హానికరం అన్న సంగతి తెలిసిందే. ఎవరెన్ని విధాలుగా చెబుతున్నప్పటికీ కొంతమంది మాత్రం ఏమవుతుందిలే అనే ధీమాతో పెడచెవిన పెడుతుంటారు. ప్లాస్టిక్ వస్తువులను వాడటమేకాదు.. ఆహార పదార్థాలను కూడా ప్లాస్టిక్ లో ప్యాక్ చేయించుకుంటారు. ప్రస్తుతం మినరల్ వాటర్ పేరుతో ప్లాస్టిక్ క్యాన్ లో నీటిని అందరూ తాగుతున్నారు.
టెక్నాలజీ పెరిగినా..
ఎంతో ఆధునికతను సంతరించుకున్న నేటికాలంలో కూడా ప్రజలు తమ మంచినీటి అవసరాల కోసం 20 లీటర్ల వాటర్ క్యాన్లపై ఆధారపడుతున్నారు. ఇలాంటి నీటిని తాగొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటర్ క్యాన్లలో నీటిని తాగడం అనేది దీర్ఘకాలంలో ఆరోగ్యానికి చేటు చేస్తుందని చెబుతున్నారు. అంతేకాదు.. పర్యావరణానికి కూడా ముప్పుందని పేర్కొంటున్నారు.

ప్లాస్టిక్ విచ్ఛిన్నం కాదు
శతాబ్దాలపాటు విచ్ఛిన్నం కాకుండా ఉండే లక్షణం ప్లాస్టిక్ సొంతం. దీనివల్ల పర్యావరణానికి హాని ఉంటుంది. నీటి నిల్వ కోసం ఉపయోగిస్తున్న కంటైనర్లు పాతవిగా మారిపోవడంవల్ల వాటిని వ్యర్థాలుగా భావించి పారవేస్తున్నారు. దీనివల్ల కాలుష్యం పెరిగిపోతోంది. మానవుడి ఆరోగ్యానికి అతి పెద్ద ముప్పు ఏమిటంటే.. ప్లాస్టిక్ నుంచి వెలువడే కెమికల్స్. ఇవి వెంటనే రక్తంలోకి ప్రవేశిస్తాయి. వాటర్ క్యాన్లు కూడా ఎక్కువ సమయం సూర్యరశ్మికి గురైనప్పుడు కూడా ఇవి నీటిలో కలుస్తాయి. వాటిని తాగితే ఆరోగ్యం సంగతి అంతే..
స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది.
ప్లాస్టిక్ క్యాన్ లో నీరు తాగడంవల్ల రోగ నిరోధక వ్యవస్థకు అంతరాయం కలుగుతుంది. థాలేట్స్ అనే కెమికల్ ఎక్కువగా ఉంటుంది. కాలేయ క్యాన్సర్, స్పెర్మ్ కౌంట్ తగ్గి క్యాన్సర్ కు కారణమవుతున్నాయి. మధుమేహం, ఊబకాయం, సంతానోత్పత్తి సమస్యలు, బాలికల్లో యుక్త వయసులో అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది. ప్లాస్టిక్ వాటర్ క్యాన్లలో నీటిని నిల్వ ఉంచుకోవడం, తాగడం మానుకోవాలి.












Click it and Unblock the Notifications