పురుషుల్లో సామర్థ్యాన్ని పెంచే ఈ ఆకుకూర
ఆకుకూరలు తినడంవల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ప్రతిరోజు వీటిని తినగలిగితే సంపూర్ణమైన ఆరోగ్యం మన సొంతమవుతుంది. ఆకు కూరల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పొన్నగంటి కూరలో శరీరానికి అవసరమైన పోషకాలుండి ఇవి పురుషులకు ఎంతో సహాయపడతాయి. సాధ్యమైనంతవరకు ప్రతిరోజు తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
పొన్నగంటి కూరలో బి6, ఏ విటమిన్లతోపాటు రైబో ఫ్లవిన్, ఫొలేట్, ఇనుము, పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. అంతేకాదు.. గుండెకు, మెదడుకు అత్యంత ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఆస్తమా, బ్రాంకైటిస్ తో బాధపడేవారు పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకోవాలి. ఎముకల ఎదుగుదలకు లభించే కాల్షియం ఎంతో దోహదపడుతుంది. ఆస్టియో పోరోసిస్ వంటివాటిని కూడా ఇది దూరం చేస్తుంది. బరువును తగ్గించడంతోపాటు క్యాన్సర్ కారకాలను నయం చేస్తుంది.

దీన్ని తినడంద్వారా ప్రధానంగా పురుషులకు కావల్సిన శక్తి సమకూరుతుంది. లైంగిక సామర్థ్యాన్ని పెంచే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. జీవక్రియలోని లోపాలను కూడా సరిచేస్తుంది. ఒక టేబుల్ స్పూన్ పొన్నగంటి కూర రసాన్ని వెల్లుల్లి కలిపి తీసుకుంటే దీర్ఘకాలికంగా వేధించే దగ్గు, ఆస్తమా ఉండదు. నరాల్లో నొప్పికి, వెన్నునొప్పికి ఇది మంచి ఔషదం. సన్నగా ఉండేవారు దీన్ని తినడంద్వారా బరువు పెరుగుతాయి. పొన్నగంటి ఆకును ఉడికించి మిరియాల పొడి, ఉప్పు కలిపి తినడంవల్ల బరువు తగ్గుతారు. కంటికలకలు కూడా తగ్గుతాయి. కళ్లమీద ఉంచుకుంటే నొప్పి తగ్గుతుంది. నరాల్లో ఉండే నొప్పిని తగ్గిస్తుంది.












Click it and Unblock the Notifications