Smart Phone: చీకట్లో మొబైల్ ఫోన్ వాడుతున్నారా.. అయితే మీకు ఆ వ్యాధి రావొచ్చు..!
మొబైల్ అధికంగా వాడడం వల్ల కంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
ప్రస్తుతం మొబైల్ ఫోన్ మన శరీరంలో ఒక భాగంగా మారిపోయింది. దేశంలో దాదాపు ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్లు ఉన్నాయి. మొబైల్ ఫోన్లలో దాదాపు 80 శాతం స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అయితే ఈ ఫోన్లు మనోళ్లు తెగ వాడేస్తున్నారు. మొబైల్ ఫోన్లు అధిక వాడకం వల్ల చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉందట. ఇందుకు సంబంధించిన హైదరాబాద్‌కు చెందిన ఒక వైద్యుడు ఇటీవల ట్విట్టర్‌లో ఆరోగ్య సంబంధిత పోస్ట్‌ను పెట్టారు.

దృష్టి వైకల్య లక్షణాలు
"30 ఏళ్ల మంజుకు ఒకటిన్నర సంవత్సరాలుగా తీవ్రమైన దృష్టి వైకల్య లక్షణాలు ఉన్నాయి. ఆమెకు కొన్ని సమయాల్లో వస్తువులను చూడలేకపోవడం లేదా వాటిపై దృష్టి పెట్టలేకపోతున్నారు" అని ట్వీట్ చేశారు. " ఆమె తన బిడ్డను చూసుకోవడం కోసం బ్యూటీషియన్ ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ఆమె ఖాళీగా ఉన్న సమయంలో మొబైల్ వాడడం మొదలు పెట్రు.
ఆమె తన స్మార్ట్‌ఫోన్‌లో ప్రతిరోజూ చాలా గంటలు బ్రౌజ్ చేసేవారు. ఆమె రాత్రి లైట్లు స్వీచ్చాఫ్ చేసిన తర్వాత కూడా రాత్రి 2 గంటల వరకు బ్రౌజింగ్ చేసేవారు" అని వివరించారు.

18 నెలల దృష్టి లోపం
ఆమెకు కంటి సమస్యలు రావడంతో తన వద్దకు వచ్చిందని.. పరీక్షలు నిర్వహించి ఆమె 'స్మార్ట్‌ఫోన్ విజన్ సిండ్రోమ్'తో బాధపడుతోందని గుర్తించారు. ఆ తర్వాత ఆమెను స్మార్ట్‌ఫోన్ వాడకాన్ని తగ్గించమని ఆమెకు సూచించాను" అని డాక్టర్ తెలిపారు. మంజు ఒక నెల తర్వాత ఆస్పత్రికి వచ్చినప్పుడు క్షేమంగా ఉన్నారని కుమార్ చెప్పారు. "ఆమెకు 18 నెలల దృష్టి లోపం పోయింది. ఇప్పుడు ఆమెకు సాధారణ కంటిచూపు ఉంది" అని పేర్కొన్నారు.

స్మార్ట్‌ఫోన్ విజన్ సిండ్రోమ్ అంటే ఏమిటి?
స్మార్ట్‌ఫోన్ విజన్ సిండ్రోమ్‌ను డిజిటల్ ఐ స్ట్రెయిన్ అని కూడా పిలుస్తారు. ఇది స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, కంప్యూటర్‌ల వంటి డిజిటల్ పరికరాలను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల వస్తుంది. దీని వల్ల కళ్లు పొడిబారడం, కంటి చూపు మందగించడం, దృష్టి మసకబారడం, తలనొప్పి, మెడ. భుజాల నొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి.
స్మార్ట్‌ఫోన్ విజన్ సిండ్రోమ్ లక్షణాలను ఎలా తగ్గించాలి
స్మార్ట్‌ఫోన్ విజన్ సిండ్రోమ్ లక్షణాలను తగ్గించడానికి, తరచుగా విరామం తీసుకోవడం, స్క్రీన్ బ్రైట్‌నెస్ మరియు కాంట్రాస్ట్‌ని సర్దుబాటు చేయడం, పరికరాన్ని కళ్లకు దూరంగా ఉంచడం మరియు కళ్లను తేమగా ఉంచడానికి కృత్రిమ కన్నీళ్లను ఉపయోగించడం మంచిదని వైద్యులు తెలుపుతున్నారు.












Click it and Unblock the Notifications