రాగిజావ ఎవరికి మంచిది...? ఎవరు దూరంగా ఎండాలి..!?
రాగిజావ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శరీరానికి కావాల్సిన పోషకాలను అందించటం లో సహకరిస్తుంది. విటమిన్లు, మినరల్స్, కార్బోహైడ్రేట్‌లు, ఫైబర్‌లు, కొవ్వులు, ప్రొటీన్‌ల వంటి అన్ని అవసరమైన స్థూలపోషకాలను కలిగి ఉంటుంది. శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. ఉదయం వేళ ఖాళీ కడుపుతో తీసుకుంటే మరింత శక్తివంతగా పని చేస్తుంది. అదే విధంగా జీర్ణ వ్యవస్థ పని తీరు ను మెరుగు పరుస్తుంది. అయితే, రాగిజావ ఎవరు ఏ సమయంలో తీసుకుంటే మరింత శక్తి వంతంగా పని చేస్తుందనే అంశం పైన నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.
రాగిజావలో అనేక రకాలైన ఆరోగ్య పోషకాలు ఉంటాయి. ఇందులో ఉండే ఫైబర్ కారణంగా కడుపు నిండుగా ఉండటంతో పాటుగా బరువు తగ్గించటంలోనూ సహాయ కారిగా నిలుస్తుంది. మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఈ జావ మేలు చేస్తుంది. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ మోతాదు తక్కువగా ఉంటుంది. దీని కారణంగా చెక్కెర స్థాయి నియంత్రణలో ఉంచుతూ.. శరీరానికి శక్తిని అంది స్తుంది. ఉదయం వేళలో తీసుకోవటం ద్వారా శరీరానికి తక్షణ శక్తిని ఇస్తూనే.. ఎముకలకు బలం అందిస్తుంది. ఇందులో ఉండే ప్రొటీన్ కణాల పునరుద్దరణకు సహకరిస్తుంది. ఇక, ఇదే సమయం లో రాగిజావ కు ప్రతీ రోజు ఒక సమయం కేటాయించి.. ఆ టైమ్ లో తీసుకోవటం ద్వారా ఆరోగ్య పరంగా ప్రయోజనం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. రాగిజావ వినియోగంలోనూ కొన్ని సూచనలు చేస్తున్నారు. రాగి జావ ఉదయం వేళ తీసుకుంటే మంచి లాభాలు ఉంటాయి.

నిపుణుల సూచనలు
అయితే, మూత్రాయశయ సమస్యలు... కిడ్నీల్లో రాళ్లు ఉన్న వారు రాగిజావ తీసుకోకపోవటం మంచిదని సూచిస్తున్నారు. థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు రాగులు తినకపోవటం మంచిది. రాగిలో థైరాయిడ్ గ్రంథి సాధారణ పనితీరుకు ఆటంకం కలిగించే గోయిట్రోజెన్‌లతో నిండి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బరువు పెరగాలనుకొనే వారికి రాగిజావ వలన ప్రయోజనం ఉండదు. అదే విధంగా మోతాదు మేరకు వినియోగిస్తే సమస్యలు ఉండవని.. అంతకు మించి తీసుకుంటే కడుపులో ఉబ్బరం తో పాటుగా డయేరియాకు అవకాశం ఉంటుందని అలర్ట్ చేస్తున్నారు. ఇన్ స్టంట్ గా వస్తున్న రాగిజావ కంటే ఇంట్లో తయారు చేసుకునే రాగిజావ ఆరోగ్య రీత్యా మంచిది. సహజసిద్ధమైన డ్రింక్ గా భావించే రాగిజావ వలన ఎన్నో ప్రయోజాలు ఉన్నా.. వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.



Click it and Unblock the Notifications