ఎముకల గట్టితనానికి ఇదొక్కటి తీసుకోండి చాలు
మారుతున్న జీవనశైలి, మారిన ఆహారపు అలవాట్లు, ఎక్కువ సమయం కూర్చొని పనిచేయడంలాంటివాటివల్ల మంచి ఆరోగ్యాన్ని అందరూ పొందలేకపోతున్నారు. పోషకాహారం కాకుండా జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం కూడా మరోకారణం. పోషకాలు లోపించడంవల్ల ఎముకలకు సంబంధించిన సమస్యలు ప్రారంభమవుతాయి. ఆల్కహాల్ తోపాటు సిగరెట్ తాగడంవల్ల కూడా ఎముకలు పెళుసుగా మారతాయి. ప్రధానంగా వర్షాకాలంలోనే ఎముకల సమస్యలు మొదలవుతాయి. అయితే చిన్న చిట్కాను పాటించడంద్వారా ఈ సమస్యను జయించవచ్చు. డబ్బు కూడా ఎక్కువగా ఖర్చుచేయాల్సిన అవసరం లేదు.
ప్రతిరోజు ఉదయమే రాగిజావ తీసుకోవడంవల్ల ఎముకల సమస్యలు తగ్గిపోయి బలంగా మారుతాయి. రాగిజావ తీసుకోవడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. ఇది మంచి అల్పాహారం. వీటిలో పాలు కలిపి తీసుకుంటే మరింత పోషకంగా మారుతుంది. కాల్షియానికి మూలం పాలు. ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో దీని పాత్ర వెలకట్టలేనిది. అలాగే అధికంగా బరువుంటే తగ్గించుకోవడానికి కూడా రాగిజావ తోడ్పడుతుంది. బాలింతల్లో చనుబాలు పెంచుతుంది.

రాగి పిండి - 2 టేబుల్ స్పూన్లు, పాలు- 250 మి.లీ, బెల్లం - 2 టీస్పూన్లు, యాలకుల పొడి- అవసరం మేరకు తీసుకోవాలి. పాలు తీసుకొని స్టవ్‌పై వేడిచేసి అందులో రాగిపిండి వేయాలి. ముద్దలు కాకుండా ఉండేందుకు తరచుగా కలుపుతూ ఉండాలి. అవసరమైతే కొన్ని నీళ్లు కలుపుకోవచ్చు. పిండి 2 నిమిషాలు ఉడికిన తర్వాత బెల్లం వేసి బాగా కలపాలి. తర్వాత యాలకుల పొడి వేయాలి. వేడి వేడి రాగిజావ తయారైనట్లే. దీన్ని కొద్దిగా చల్లబరిచి తీసుకోవాలి. ప్రతిరోజు తాగితే అద్భుత ఫలితాలు సొంతమవుతాయి.












Click it and Unblock the Notifications