రోజూ రాగిజావ తాగుతున్నారా..? లాభాలే కాదు, వీరికి సమస్యే..!!

రాగిజావ ఆరోగ్యానికి మంచిది. మంచి పోషకాలను కలిగి ఉంటుంది. ఇందులో ఉండే కార్బో హైడ్రేట్స్ శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. ఉదయం వేళ ఖాళీ కడుపుతో తీసుకుంటే మరింత శక్తివంతగా పని చేస్తుంది. అదే విధంగా జీర్ణ వ్యవస్థ పని తీరు ను మెరుగు పరుస్తుంది. కడుపులో సహజంగా వచ్చే సమస్యలను నియంత్రిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ కారణంగా కడుపు నిండుగా ఉండటంతో పాటుగా బరువు తగ్గించటంలోనూ సహాయ కారిగా నిలుస్తుంది. అయితే, ఈ రాగి జావ తో లాభాలతో పాటుగా నష్టాలు ఉన్నాయని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

ప్రతిరోజూ రాగిజావను తీసుకోవచ్చు. అయితే దీనికంటూ ఓ టైమ్ ఫిక్స్ చేసుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు తాగటం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. రాగి జావను ఉదయం తీసుకుంటే చాలా మంచిది. కానీ రాత్రిపూట తీసుకోవడం మంచిది కాదని సూచిస్తున్నారు. రాగిజావ సహజ సిద్దంగా శరీరానికి మేలు చేస్తుంది. ఇందులో ఉండే కాల్షింయ.. పోషకాలు ఎంత గానో ఉపకరిస్తాయి. చర్మానికి కావాల్సిన తేమను అందించి..ఆరోగ్యంగా ఉంచేందుకు సహకరి స్తుంది. మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఈ జావ మేలు చేస్తుంది. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ మోతాదు తక్కువగా ఉంటుంది. దీని కారణంగా చెక్కెర స్థాయి నియంత్రణలో ఉంచుతూ.. శరీరానికి శక్తిని అందిస్తుంది. ఉదయం వేళలో తీసుకోవటం ద్వారా శరీరానికి తక్షణ శక్తిని ఇస్తూనే.. ఎముకలకు బలాన్నిస్తుంది. ఇందులో ఉండే ప్రొటీన్ కణాల పునరుద్దరణకు సహకరిస్తుంది.

 సికింద్రాబాద్ నుంచి అయోధ్య, హరిద్వార్ కు కొత్త రైళ్లు ఖరారు- రూట్, ముహూర్తం..!!
సికింద్రాబాద్ నుంచి అయోధ్య, హరిద్వార్ కు కొత్త రైళ్లు ఖరారు- రూట్, ముహూర్తం..!!
ragi-malt-is-a-nutritious-choice-for-all-ages-packed-with-essential-nutrients-here-the-studies-re

అధ్యయనాల నివేదిక

రాగి జావ అధిక వినియోగం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, డయేరియా వచ్చే అవకాశముంది. కొందరికి దీని వల్ల కొందరిలో అలర్జీ వంటివి కూడా రావొచ్చు. రాగిజావ వినియోగంలోనూ కొన్ని సూచనలు చేస్తున్నారు. రాగి జావ ఉదయం వేళ తీసుకుంటే మంచి లాభాలు ఉంటాయి. రాత్రి సమయంలో కొందరికి ఇబ్బందులకు కారణం అవుతుందని చెబుతున్నారు. అదే విధంగా మూత్రాయశయ సమస్యలు... కిడ్నీల్లో రాళ్లు ఉన్న వారు రాగిజావ తీసుకోకపోవటం మంచిదని సూచిస్తున్నారు. బరువు పెరగాలనుకొనే వారికి రాగిజావ వలన ప్రయోజనం ఉండదు. అదే విధంగా మోతాదు మేరకు వినియోగిస్తే సమస్యల ఉండవని.. అంతకు మించి తీసుకుంటే కడుపు లో ఉబ్బరం తో పాటుగా డయేరియాకు అవకాశం ఉంటుందని అలర్ట్ చేస్తున్నారు. థైరాయిడ్ సమస్యలు ఉన్న వారు వైద్యుల సూచనల మేరకే రాగిజావను తీసుకోకపోవటం మంచిది. ప్రస్తుతం ఇన్ స్టంట్ గా వస్తున్న రాగిజావ కంటే ఇంట్లో తయారు చేసుకునే రాగిజావ ఆరోగ్య రీత్యా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+