Heart Attack: రూట్‌ కెనాల్‌కు, హార్ట్ ఎటాక్‌కి సంబంధం..? హృదయారోగ్యంపై దంతాల పెను ప్రభావం

Root Canal: మానవ శరీర నిర్మాణంలో దంతాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. జీవిత కాలంలో టన్నుల కొద్దీ ఆహారపదార్థాలను సునాయాసంగా నమలడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రజల ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో ఇటీవల వచ్చిన మార్పుల కారణంగా దంత సమస్యలు ఈ మధ్య అధికమవుతున్నాయి. తద్వారా రూట్ కెనాల్ వంటి థెరపీలను ఆశ్రయించాల్సి వస్తోంది. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదు. దంతాలకు, గుండెకు సంబంధం ఏమిటో తెలుసుకుందాం..

దంత సమస్యల నివారణ కోసం ఉద్దేశించిన రూట్ కెనాల్ థెరపీ(RTC) గుండెపోటుకి కారణమవుతుందని చాలా మంది నమ్ముతుంటారు. ఇది కేవలం అపోహ మాత్రమే అని కొట్టిపారేసేవారు కూడా ఉన్నారు. అయితే ఈ ట్రీట్‌మెంట్ సురక్షితమని విస్తృతంగా వైద్యులచే ఆమోదించబడింది. అయినప్పటికీ వదంతులు వ్యాపించడం వెనుక సాలిడ్ రీజన్ లేకపోలేదు.

Relation between Root Cana and Heart attacks

రూట్ కెనాల్ చికిత్సలో వ్యాధిగ్రస్త కణజాలాన్ని దంతాల నుంచి తీయడానికి వైద్యులు ఆపరేషన్ నిర్వహిస్తారు. పన్నుకు మరింత హాని కలగకుండా ఆపడానికి బాక్టీరియాను తొలగిస్తారు. ఈ ప్రక్రియలో ఏర్పడిన ఖాళీ స్థలాన్ని ఓ ప్రత్యేక పదార్థంలో పూడ్చుతారు. తద్వారా తీసి పారేయాల్సిన దంతాన్ని సురక్షితంగా సేవ్ చేస్తారు. ఈ ఆపరేషన్ మొత్తం సాధారణ అనస్థీషియా ఇచ్చిన అనంతరం చేయబడుతుంది కాబట్టి ఇతర సమస్యలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది.

RTC చేసే క్రమంలో నోరు లేదా దంతాలకు సంబంధించిన బాక్టీరియా రక్త ప్రవాహం ద్వారా గుండెలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి ఆ రక్తం శరీరంలోని ఇతర భాగాలకు సరఫరా అవుతుంది. దీంతో ఆయా ప్రదేశాల్లో మంట వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. అయితే 'ఎండోడోంటిక్ థెరపీ అండ్ ఇన్సిడెంట్ కార్డియోవాస్కులర్ డిసీజ్: ది అథెరోస్క్లెరోసిస్ రిస్క్ ఇన్ కమ్యూనిటీస్ (ARIC)' అధ్యయనం ప్రకారం రూట్ కెనాల్ చికిత్సలు నేరుగా గుండెపోటుకు కారణమవుతాయని ఖచ్చితమైన ఆధారాలు లేవు.

కాబట్టి రూట్ కెనాల్స్ చికిత్స చేయించుకుంటే గుండెపోటు వస్తుందనేది కేవలం అపోహ మాత్రమే. కానీ గుండె మరియు దంత ఆరోగ్యం మధ్య బలమైన సంబంధం ఉందని గమనించాలి. దంతాల అపరిశుభ్రత చిగుళ్ల వ్యాధులకు కారణమవుతుంది. తద్వారా బ్యాక్టీరియా రక్తప్రవాహంలోకి ప్రవేశించడం ద్వారా హృదయ సంబంధ సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి చిగుళ్ల వ్యాధి ఉన్నవారిలో గుండె సమస్యలు సర్వసాధారణం. చిగుళ్ల వ్యాధి మరియు గుండె సమస్యల మధ్య అనుబంధం ఉందనే విషయానికి 'పీరియాడోంటిటిస్ మరియు కార్డియోవాస్కులర్ వ్యాధులు: ఏకాభిప్రాయ నివేదిక' అనే అధ్యయనం మద్దతు ఇస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+