Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Sankranti Special : స్పైసీగా పెసరపప్పు చెక్కలు

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని పల్లెటూరులు పండక్కి సిద్ధమై అతిధులకు ఆహ్వానం పలుకుతున్నాయి. పండగ ఏర్పాట్లలో మగవాళ్లంతా బీజిబిజీ.. పిండివంటల తయారీలో మహిళలంతా మునిగిపోయారు. వచ్చే అతిధులకు, కుటుంబ సభ్యులకు స్వీట్, హాట్ కాంబినేషన్ లో అదిరిపోయే వంటకాలు సిద్ధమవుతున్నాయి.

సంక్రాంతికి ఇంటికి వెళ్లిన వారు అందరూ తిరిగి సిటికి వచ్చేటప్పుడు పిండి వంటలు తీసుకువస్తుంటారు. ముఖ్యంగా చలికాలం కాబట్టి స్వీట్స్ తక్కువగా తిన్నా.. హాట్ ఐటమ్స్ మాత్రం బాగా తింటారు. అందులో అందరూ బాగా సేల్ చేసే ఐటమ్స్ జంతికలు, చక్కలు, మిర్చర్, ఇలా పెద్ద లిస్టే ఉంది. కాని ఏపీలో ప్రతి ఇంట్లో మస్ట్ గా చేసుకునే ఐటమ్స్ లిస్ట్ లో ఉండే వంటకం పెసరపప్పు చెక్కలు. అది హెల్తీగా, స్పైసీగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా..

సంక్రాంతి వచ్చిందంటే ఇంటిల్లిపాది నోట్లో తిరిగేది ఒక్కటే మాట - చెక్కలు, గారెలు, అరిసెలు!
అయితే ఈసారి కాస్త ట్రెడిషన్‌తో పాటు హెల్త్ టచ్ కూడా కలిపితే ఎలా ఉంటుంది? అదే ఆలోచనతో మీ కోసం తీసుకొచ్చాం - పెసరపప్పు చెక్కలు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం... పైగా ట్రెండీ స్నాక్‌గా పిల్లల నుంచి పెద్దల వరకూ అందరికీ నచ్చే స్పెషల్ ఐటమ్‌ ఇది.

Sankranti Special Pesara Pappu Chekkalu A Healthy and Crispy Traditional Snack

దీని తయారీకి కావాల్సిన ఐటమ్స్..

బియ్యప్పిండి - 3 కప్పులు, పెసరపప్పు - ¼ కప్పు, కారం - 2 చెంచాలు (మీ రుచికి తగ్గట్టు), ఉప్పు తగినంత, అల్లం - చిన్న ముక్క, పచ్చిమిర్చి - 3, జీలకర్ర - 1 చెంచా, కరివేపాకు - 2 రెబ్బలు, నూనె - వేయించడానికి సరిపడా (గ్రౌండ్నట్ ఆయిల్ లేదా రైస్ బ్రాన్ ఆయిల్ వాడితే మరింత మంచిది)

తయారీ విధానం..

ముందుగా మిక్సీలో పచ్చిమిర్చి, అల్లం వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. పెసరపప్పును శుభ్రంగా కడిగి సుమారు 10 నిమిషాలు నానబెట్టాలి. ఇప్పుడు వెడల్పాటి పళ్లెంలో బియ్యప్పిండి, నానబెట్టిన పెసరపప్పు, అల్లం-మిర్చి పేస్ట్‌, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి.రెండు చెంచాల వేడి నూనె వేసి మళ్లీ కలిపితే చెక్కలు మరింత క్రిస్పీగా వస్తాయి. కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. పిండిని చిన్న ఉండలుగా చేసి పూరీ ప్రెస్‌తో లేదా చేత్తో పల్చగా ఒత్తుకోవాలి. కడాయిలో నూనె బాగా వేడెక్కాక ఈ చెక్కలను మోస్తరు మంటపై ఎర్రగా, కరకరలాడేలా వేయించుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో పెట్టుకుంటే శివరాత్రి వరకూ ఫ్రెష్‌గా ఉంటాయి.

ఆరోగ్యానికి మేలు..

ఇందులో మైదా లేదు కాబట్టి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పెసరపప్పు ప్రోటీన్ లా ఉపయోగపడుతుంది. హోమ్‌మేడ్ అండ్ నో ప్రిజర్వేటివ్స్ కాబట్టి తినడానికి బయపడాల్సిన అనవసం లేదు. ఈ సంక్రాంతికి మార్కెట్ స్నాక్స్‌కి బ్రేక్‌ ఇచ్చి, ఇంటి వంట - ఆరోగ్యకరమైన రుచితో పండగను మరింత ప్రత్యేకం చేసుకోండి. మీ ఇంట్లో ఒకసారి చేసిచూడండి... "ఇంకో చెక్క" అనకుండా ఎవరూ ఉండరు!

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+