ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మానేయటం ఎంత డేంజరో తెలుసా!
చాలామంది ఉదయం బ్రేక్ఫాస్ట్ మానేస్తుంటారు. అయితే బ్రేక్ ఫాస్ట్ మానేయడం ఏమాత్రం మంచిది కాదని చాలామంది చెబుతూ ఉంటారు. ఒక్క నెలరోజుల పాటు అల్పాహారం మానేస్తే ఏం జరుగుతుంది? ఉదయం అల్పాహారం మానేయడం ఎంత డేంజర్? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
అల్పాహారం స్కిప్ చేస్తే అనేక అనారోగ్యాలు
ఎవరైనా ఉదయం లేచిన తర్వాత ఆ రోజును ఒక గుడ్ స్టార్ట్ తో ప్రారంభించాలి. అయితే అల్పాహారం స్కిప్ చేసి రోజును ప్రారంభించిన వారికి, వారికి తెలియకుండానే అనేక ఇబ్బందులు వస్తాయి. ఉదయం అల్పాహారం తీసుకోకపోవడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందవు. అల్పాహారం తీసుకుంటే శరీరానికి కావలసిన గ్లూకోజ్ అందుతుంది. రక్తంలో చక్కెర స్థాయి నిర్వహించబడుతుంది.

అల్పాహారం మానేస్తే టైప్ 2 డయాబెటిస్ ముప్పు
అయితే అల్పాహారం ఎక్కువగా కాలం మానేయడం కారణంగా శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. ఫలితంగా టైప్ టు డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు శరీరానికి పోషకాలు అందకపోవడం వల్ల శరీరం వ్యాధులకు నిలయంగా మారుతుంది. కాబట్టి ఉదయం అల్పాహారం తీసుకోవడం ఎంతో అవసరం.
అల్పాహారం తీసుకోకుంటే మానసిక ఒత్తిడి
ఒక నెలరోజుల పాటు అల్పాహారాన్ని స్కిప్ చేస్తే మన శరీరంలో సెరటోనిన్ స్థాయిలు దెబ్బతింటాయి. దీని కారణంగా మానసికంగా తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. చిరాకు, ఆందోళన, నిరాశ వంటి లక్షణాలు అల్పాహారం తీసుకోని వారిలో పెరుగుతాయి. అల్పాహారం తీసుకోకుండా దాటవేయడం కారణంగా బరువు తగ్గుతామని చాలామంది భావిస్తారు. అయితే దీనివల్ల అనారోగ్యకరమైన బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అల్పాహారం తీసుకోకుంటే బరువు పెరిగే ప్రమాదం
అల్పాహారం తీసుకోని వారు మధ్యాహ్న భోజనంలో ఎక్కువగా తింటారు. ఇది బరువు పెరగడానికి కారణం అవుతుంది.
ఇక అల్పాహారం తీసుకోని వారిలో మెటబాలిక్ సిండ్రోమ్ ప్రమాదం పెరుగుతుంది. ఇది గుండెజబ్బులకు, టైప్ టు డయాబెటిస్ కు, రక్తపోటుకు కారణం అవుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడాలంటే తప్పనిసరిగా అల్పాహారాన్ని తీసుకోవాలి.
అల్పాహారం తీసుకోకుంటే జరిగేదిదే
ఉదయం అల్పాహారం తీసుకోని వారిలో రోగనిరోధక శక్తి గణనీయంగా తగ్గుతుంది. జీవక్రియ మందగిస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలు కూడా పెరుగుతాయి. మైగ్రేన్ వంటి సమస్యలు వస్తాయి. అల్సర్లు, గ్యాస్ సమస్యలు చోటు చేసుకుంటాయి. కాబట్టి అల్పాహారాన్ని మానివేయడం ఏమాత్రం మంచి అలవాటు కాదు. తప్పనిసరిగా ఉదయం పరిమితంగా ప్రతి ఒక్కరూ బ్రేక్ఫాస్ట్ చేయాలి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications