టీ తాగుతూ దమ్ము కొడుతున్నారా.. అయితే, ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..!!

చాలా మందికి టీ తాగేటప్పుడు ధూమపానం చేసే అలవాటు ఉంటుంది. టీ తాగుతూ ధూమపానం చేస్తుంటారు. రిలాక్స్‌గా ఉండటం కోసం ఇలా చేసేవారు ఉన్నారు. అయితే, టీ తాగుతూ ధూమ పానం చేయడం అరోగ్యానికి అత్యంత హానీకరం అని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగానే ధూమపానం క్యాన్సర్‌కు కారణం. అలాంటి తరుణంలో ధూమపానం చేస్తూ టీ సేవించడం మరింత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. టీ, సిగరెట్ కలయిక ఆరోగ్య ప్రమాదాలను మరింత రెట్టింపు చేస్తుందని హెచ్చరిస్తున్నారు.

టీ తాగుతూ సిగరెట్ తాగడం వల్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా అధ్యయనం ప్రకారం... టీతో కలిపి సిగరెట్ తాగడం వల్ల అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం 30 శాతం పెరుగుతుందని అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం, వేడి టీ జీర్ణ కణాలను దెబ్బతీస్తుందని, టీ-సిగరెట్‌ను కలిపి తాగడం వల్ల శరీరంలో కణాలు దెబ్బతినే ప్రమాదం రెండు రెట్లు పెరుగుతుందని పరిశోధన తేల్చింది. టీలో కెఫీన్ ఉంటుందని, దీని వల్ల కడుపులో జీర్ణక్రియకు సహాయపడే ప్రత్యేక యాసిడ్ ఉత్పత్తి అవు తుందని, అయితే ఎక్కువ కెఫిన్ కడుపులోకి చేరితే హానికరం అంటున్నారు నిపుణులు. సిగరెట్ లో నికోటిన్ ఉంటుందని.. టీ, సిగరెట్‌ రెండూ రక్తపోటును పెంచుతాయని తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.

smoking-while-drinking-tea-leads-to-many-health-risks-here-the-details

దీంతో, గుండె కొట్టుకునే వేగాన్ని పెంచుతాయని, రక్తనాళాలపై ప్రభావం చూపుతాయి. దీని వల్ల గుండెపోటు, స్ట్రోక్ మరియు ఇతర హృదయ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగే అవకాశం ఉంటుంది. టీ, సిగరెట్‌ కలిసి తీసుకోవడం వల్ల అజీర్తి, మలబద్ధకం, అల్సర్స్ లాంటి ఇతర జీర్ణవ్యవస్థ సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రెండు కలిపి తీసుకోవటం వలన గుండెపోటు ప్రమాదం, అన్నవాహిక క్యాన్సర్, గొంతు క్యాన్సర్, కడుపు పూత, నపుంసకత్వము, వంధ్యత్వం యొక్క ప్రమాదం, చేతులు, కాళ్ల పూత, జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదం, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ ప్రమాదం, తక్కువ ఆయుర్దాయం, ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో.. ఇప్పటి వరకు ఈ రెండు కలిపి తీసుకోవటం అలవాటు ఉన్న వారు వెంటనే మానుకోవటం మంచిదని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+