మీ ఎముకలు బలంగా ఉండాలంటే ఇవి మానేస్తే చాలు
ఎముకలు బలహీనంగా ఉంటే ఎవరూ ఏ పని చేయలేరు. తరుచుగా అనారోగ్యానికి గురవుతుంటారు. శరీరం ధృఢంగా ఉండాలంటే ఎముకలు కూడా ఎంతో ధృఢంగా ఉండాలి. కానీ మారుతున్న జీవనశైలివల్ల, ఆహారపు అలవాట్ల వల్ల ఎముకలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. పెళుసుగా మారిపోయి అతి చిన్న కారణానికే విరిగి ముక్కలవుతున్నాయి. బలమైన ఎముకలు కావాలంటే ఈ అలవాట్లను మానుకోవాలి. అవి ఏమేమిటనేది తెలుసుకుందాం.
* కూల్ డ్రింక్స్ తాగే అలవాటు రోజురోజుకు పెరుగుతోంది. పెళ్లిళ్లని, పార్టీలనీ.. రోజువారీ జీవితంలో ఇవి తీసుకోవాల్సిన అవసరం లేకపోయినా అవి తీసుకుంటేనే రోజు గడిచేలా అలవాటు చేసుకుంటున్నారు. వీటిల్లో ఫాస్పేట్ ఎక్కువగా ఉంటుంది. శరీరం నుంచి కాల్షియాన్ని తొలగించడానికి ఇది దోహదపడుతుంది. తరుచుగా శీతల పానీయాలు తీసుకునేవారి ఎముకలు బలహీనంగా మారిపోతాయి.

* మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లతో మానసిక అనారోగ్యం ఎక్కువవుతోంది. మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే శరీర ఆరోగ్యం బాగుంటుంది. చేతిలో డబ్బులు లేకపోవడం, పనిచేసేచోట ఏదైనా సమస్యలు ఎదురవడం, తీవ్రమైన అనారోగ్యంలాంటి కారణాలవల్ల టెన్షన్ కు గురవుతున్నారు. రోజంతా ఎక్కువ సమయం కూర్చొని పనిచేయడం కూడా ఒక కారణమవుతోంది. సాధ్యమైనంతవరకు ప్రతిరోజు వ్యాయామం చేస్తుండాలి. ఎక్కువ ఒత్తిడికి గురైతే ఎముకలు బలహీనపడతాయి. టెన్షన్ వల్ల కార్టిసాల్ హార్మోన్ పెరిగి.. మలం ద్వారా కాల్షియం బయటకు వెళ్లిపోతుంది.
* ఎముకల దృఢంగా ఉండాలంటే ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. గుడ్లు, సోయాబీన్, మాంసం, పప్పులు వంటివాటిని తీసుకోవడంవల్ల ఎముకలు బలంగా మారతాయి.
* మనదేశంలో ఎక్కువ మంది ఉదయం నిద్ర లేవగానే టీ, కాఫీ తాగుతుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏడెనిమిదిసార్లు కాఫీ, టీలు తాగేవారు కూడా ఉన్నారు. వీటిల్లో కెఫిన్ ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. దీనివల్ల శరీరంలో కాల్షియం అవసరం పెరుగుతుంది. అందుకే కాల్షియం ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.












Click it and Unblock the Notifications