చలికాలంలో చింతపండు తింటే ప్రమాదమా?

చింత కాయలతో మనందరి విడదీయరాని అనుబంధం ఉంది. మరీ ముఖ్యంగా 90s కిడ్స్ కు చింత చెట్లతో ఉన్న బాండింగ్ వేరే. చిన్నప్పుడు హాలి డేస్ లో చింతచెట్ల దగ్గర చేసిన సందడితో పాటు.. రుచి చూసిన చింతకాయలు.. ఇంకా మనకు మధురానుభూతులే. సంక్రాంతి సెలవులకు పల్లెటూర్లు వెళ్లిన వాళ్లందరూ కచ్చితంగా చింతకాయలు టేస్ట్ చేసే ఉంటారు. మరి చలికాలంలో చింతపండు, చింతకాయలు తింటే ఏమవుతుంది. అసలు చింతపండు ఆరోగ్యానికి మంచిదేనా?

భారతీయ వంటకాలలో చింతపండు ఒక సాధారణ పదార్థం. కానీ అందులో దాగి ఉన్న పోషక విలువలు అమోఘం. కేవలం రుచికోసమే కాదు ఆరోగ్య పరిరక్షణ కోణంలోనూ చింతపండుది ముఖ్యమైన పాత్ర. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్ తో పాటు విటమిన్లు ఏ, సి, ఈ, కే, బీ6 వంటి అనేక సూక్ష్మ పోషకాలు ఉన్నాయి. అంతేకాదు చింతపండులో మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాల్షియం, పొటాషియం, వంటి ఖనిజాలు కూడా దండిగా ఉంటాయి. ఇవన్నీ మానవ శరీరాన్ని అనేక రకాల ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేస్తాయి. రోజూ తినే ఆహారంలో చింతపండును చేర్చుకోవడం ద్వారా ఇమ్యూనిటీని కూడా పెంచుకోవచ్చు.

వాతావరణ మార్పుల సమయంలో మరీ ముఖ్యంగా చలికాలలో తరచూ వచ్చే జలుబు దగ్గు వంటి సమస్యల నుంచి రక్షణ పొందడంలో చింతపండు ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సీ ఇమ్యూనిటీని పెంచి శరీరాన్ని జలుబు, దగ్గు నుంచి రక్షిస్తాయి. చలికాలంలో చాలా మందికి జీర్ణక్రియ మందగిస్తుంది. చలి నుంచి విముక్తి కోసం తీసుకునే టీ,కాఫీలు జీర్ణక్రియపై ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి చింతపండు తీసుకుంటే ఉండే సహజ పదార్థాలు జీర్ణక్రియను మెరుగుపరచి మెటబాలిజాన్ని చురుకుగా ఉంచుతాయి.

Strengthen Your Immunity This Winter With Tamarind

గుండెకు మంచిది..

గుండె ఆరోగ్యానికి చింతపండు బాగా పని చేస్తుంది. ఇందులో ఉండే పాలీఫెనాల్స్ ఫ్లేవనాయిడ్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. అదే సమయంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిని సమతుల్యంగా ఉంచడంలో తోడ్పడతాయి. ఇందులో సమృద్ధిగా ఉండే పొటాషియం హార్ట్ బీట్ ను బ్యాలెన్స్ చేస్తుంది.

జుట్టుకు బలం

చలికాలంలో చాలా మందికి చుండ్రు సమస్య ఎక్కువగా ఉంటుంది. పైగా జుట్టు రాలిపోతుంది. జుట్టు ఆరోగ్యం కోసం చింతపండులోని విటమిన్లు ఖనిజాలు బాగా పనిచేస్తాయి. హెయిర్ ఫాల్ ను తగ్గిస్తుంది. క్రమంగా చింతపండును ఆహారంలో భాగం చేస్తే జుట్టు సహజంగా బలంగా మెరుస్తూ ఉండేందుకు తోడ్పడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+