సూపర్ టేస్టీ 'పుదీనా టమాటా పచ్చడి'.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు..!
పూదీనా ఆరోగ్యానికి చాలా మంచింది. పూదీనాను అనేక విధాలుగా ఆహారంలో భాగం చేసుకుంటారు. బిర్యానీ, మటన్ లో పూదీనా కచ్చితంగా ఉండాల్సిందే. అయితే పూదీనాతో పచ్చడి కూడా చేసుకోవచ్చు. పూదీనా టమాటా పచ్చడి అద్దిరిపోయే టేస్ట్ ఉంటుంది. అన్నంలోకి మాత్రమే కాకుండా టిఫిన్ లోకి కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..?
సూపర్ టేస్టీ 'పుదీనా టమాటా పచ్చడి' తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. పుదీనా ఆకులు నాలుగు కప్పులు, పచ్చి మిర్చి తగినన్ని, టమాటోలు నాలుగు, వెల్లుల్లి రెబ్బలు 15 నుంచి 20, అల్లం చిన్న ముక్క, జీలకర్ర ఓ టేబుల్ స్పూన్, పల్లీలు ఐదారు టేబుల్ స్పూన్ లు తీసుకోవాలి. మరి పుదీనా టమాటా పచ్చడి తయారీ విధానం చూస్తే.. ముందుగా పూదీనా ఆకులను తుంచుకుని శుభ్రంగా కడిగి పక్కనపెట్టుకోవాలి.
ఇప్పుడు టమాటో ముక్కలను మీడియం సైజులో కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెలో పల్లీలు వేసుకుని బాగా వేయించాలి. అవి వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే గిన్నెలో నాలుగు టీ స్పూన్ ల నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో పచ్చి మిర్చి ముక్కలను వేసి వేయించుకోవాలి.
అనంతరం అదే గిన్నెలో టమాటా ముక్కలు వేసి కాసేపు వేయించాలి. మూడ్నాలుగు నిమిషాల పాటు లో టూ మీడియం ఫ్లేమ్ లో అలా మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులో పుదీనా ఆకులు, చింతపండు వేసి బాగా కలిపి కొద్దిసేపు ఉడికించుకోవాలి. అలా ఉడికించుకున్నాక ఆ మిశ్రమాన్ని కాస్త చల్లార్చుకోవాలి.

ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకుని అందులో ముందుగా వేయించిన పల్లీలు, పచ్చిమిర్చి, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్క, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని గ్రైండింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో పుదీనా టమాటా మిశ్రమం వేయాలి. రోటిలో రుబ్బుకున్న విధంగా మిక్సీ పట్టుకోవాలి. అంతే పుదీనా టమాటా చట్నీ రెడీ అయినట్టే. ఇప్పుడు ఈ చట్నీని తాలింపు పెట్టుకుంటే చాలు సూపర్ టేస్టీగా ఉంటుంది.












Click it and Unblock the Notifications