గుండెపోటు వస్తుందని ముందే హెచ్చరించే లక్షణాలు.. వీటిని నిర్లక్ష్యం చేస్తే అంతే.
గుండెపోటు అనేది ప్రాణాంతక పరిస్థితి, అయితే దీని వచ్చే ముందు శరీరం కొన్ని హెచ్చరికల లక్షణాలను చూపిస్తుంది. వీటిని సమయానికి గుర్తించి వైద్య సహాయం పొందడం చాలా ముఖ్యమైంది. గుండెపోటు హఠాత్తుగా వచ్చే సమస్యగా కనిపించినప్పటికీ, చాలాసార్లు శరీరం ముందే హెచ్చరికల సంకేతాలను ఇస్తుంది. గుండెపోటు తీవ్రమైన ఆరోగ్య సమస్య కాబట్టి, ఏ మాత్రం అనుమానం వచ్చినా వైద్య సహాయం తీసుకోవడం చాలా అవసరం.
గుండెపోటుకు ముందు కనిపించే లక్షణాలు:
ఛాతీలో నొప్పి: ఇది అత్యంత సాధారణ లక్షణం. ఈ నొప్పి ఛాతీలో ఒత్తిడి, నొక్కడం, బిగుతుగా అనిపించవచ్చు. అది రావచ్చు, పోవచ్చు, లేదా స్థిరంగా ఉండవచ్చు. ఆ నొప్పి చేతులు, మెడ, దవడ, వీపు లేదా కడుపుకు కూడా వ్యాపించవచ్చు .గుండెపోటు సమయంలో చాలా మంది ఛాతీలో గట్టిగా నొప్పి, బరువుగా అనిపించడం, లేదా ఒత్తిడి వంటి బాధను అనుభవిస్తారు. ఇది సాధారణంగా ఛాతి మధ్య భాగంలో ఉంటూ కొద్ది నిమిషాల పాటు కొనసాగుతుంది లేదా మధ్య మధ్యలో రావచ్చు.

శ్వాస ఆడకపోవడం - అలసట: ఛాతీ నొప్పితో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా కనిపించవచ్చు. అకస్మాత్తుగా చాలా చెమట పట్టడం కూడా గుండెపోటుకు సంకేతం కావచ్చు. సాధారణ పనులు చేసినా అలసటగా అనిపించడం.కొన్నిసార్లు, ముఖ్యంగా కాలి వాపు గుండెపోటుకు సంకేతం కావచ్చు. కొంతమందికి గుండె చప్పుడు వినపడవచ్చు. గుండెపోటు వల్ల రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల మైకం లేదా తలనొప్పి వచ్చే అవకాశం ఉంది.
గుర్తుంచుకోవలసిన విషయాలు:
గుండెపోటు లక్షణాలు అందరిలో ఒకే విధంగా ఉండవు. కొంతమందిలో కొన్ని లక్షణాలు మాత్రమే కనిపించవచ్చు. మహిళల్లో పురుషుల కంటే గుండెపోటు లక్షణాలు భిన్నంగా ఉండవచ్చు. మహిళల్లో ఛాతీ నొప్పి కంటే కూడా వెన్నునొప్పి, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. గుండెపోటు లక్షణాలు గ్యాస్ట్రిక్, యాసిడ్ రిఫ్లక్స్ వంటి ఇతర సమస్యల లక్షణాల మాదిరిగానే ఉండవచ్చు. కాబట్టి ఏ మాత్రం అనుమానం వచ్చినా వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.
గుండెపోటును ఎలా నివారించవచ్చు:
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు బరువును నియంత్రించుకోండి. రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోండి. ధూమపానం చేయవద్దు. మద్యం తీసుకోవడాన్ని తగ్గించుకోవడం మంచిది. అంతే కాకుండా ఒత్తిడిని నుంచి పూర్తిగా బయటపడాలి.గుండెపోటు ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్య. దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. పై చెప్పిన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.












Click it and Unblock the Notifications