టీ vs కాఫీ: ఆరోగ్యానికి ఎవరికి ఏది మంచిది, ఏది డేంజర్..!?
ప్రతీ ఇంటా టీ - కాఫీ ఉండాల్సిందే. చాలా మందికి ఇవి లేకుండా రోజు మొదలు కాదు. ప్రతీ రోజు నాలుగు సార్లు వరకు వీటిని సేవించే వారు ఉన్నారు. జీవన శైలిలో ఈ రెండు ఒక భాగంగా మారిపోయాయి. ఉదయాన్నే టీ లేదా కాఫీ తాగితే వెంటనే మైండ్ రీఫ్రెష్ అవుతుందని చాలా మంది భావిస్తారు. అయితే, కాఫీ, లేదా టీ ఏది తాగితే ఆరోగ్యానికి మంచిది అనే సందేహం చాలా మందిలో నెలకొంది. కాగా.. తాజాగా ఒక అధ్యయనం టీ - కాఫీ ఆరోగ్య పరంగా ఎవరికి ఏది మంచిదో వివరిస్తూనే.. కీలక అంశాలను వెల్లడించింది.
టీ- కాఫీ రెగ్యులర్ గా తీసుకునే వారిలో అనేక సందేహాలు ఉంటాయి. టీ లేదా కాఫీ ఆరోగ్యానికి మేలు చేస్తుందా.. ఏది తీసుకుంటే ఉపయోగం ఉంటుందో నిపుణులు స్పష్టత ఇస్తున్నారు. ఉదయం సమయంలో టీ లేదా కాఫీ తాగటానికి అలవాటు పడిన వారు ఏ ఒక్క రోజు తాగకుండా ఉండలేరు. ఇలా టీ కాఫీలకు అలవాటు పడటం వెనుక ఏ కారణం ఉన్నా, ఈ రెండిటిలో ఏది బెస్ట్ అనే విషయానికి వస్తే.. టీ కాఫీ రెండింటి ప్రయోజనాల తో పాటుగా దుష్ప్రభావాలు ఉన్నాయి. కాగా, టీ లో ఎల్ థియోనైన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది మన మెదడును స్టిమ్యులేట్ చేస్తుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్ మనలో ఫోకస్, అటెన్షన్, ఆలోచనా శక్తిని పెంచుతుంది. రెగ్యు లర్ గా టీ తాగే వారిలో ఎముకల సాంద్రత ఎక్కువగా ఉండడంతో పాటు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాఫీలో ఎక్కువగా ఉండే కెఫీన్ వల్ల బరువు తగ్గే వీలుంటుందని నిపుణులు వెల్లడి స్తున్నారు.

నిపుణుల సూచనలు
కాగా, అనేక మంది బ్లాక్ కాఫీని వర్కవుట్ ముందు ప్రీ వర్కవుట్‌గా తీసుకుంటూ ఉంటారు. కొవ్వును కరిగించే గుణాలు కాఫీలో ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా గుండె జబ్బులు, డయాబెటిస్, పార్కిన్సన్స్ వంటి సమస్యలను కూడా తగ్గించేందుకు కాఫీ దోహదపడుతుంది. ఇక, కాఫీ ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. టీ ఎక్కువగా తాగడం వల్ల ఆహారంలోని ఐరన్ ని తీసుకోవడానికి ఇబ్బంది ఎదురవుతుంది. కాగా, ఆహారం తిన్న తర్వాత టీ తాగడం వల్ల ఆహారంలోని ఐరన్‌ని తీసుకునే శక్తి 62 శాతం మేర తగ్గుతుంది. కాఫీ తీసుకుంటే ఇది కేవలం 35 శాతం మేరకే ఉంటుంది. టీ తో పోల్చితే కాఫీ చాలా ఎసిడిక్ గుణం కలిగి ఉంటుంది. ఫిల్టర్ చేయని కాఫీ వల్ల కొలెస్ట్రాల్ కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. రోజూ నాలుగు కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగితే ఎముకల సాంద్రత తగ్గే అవకాశాలుంటాయని విశ్లేషిస్తున్నారు. దీనివల్ల ఎముకలు పెళుసుబారడం, విరగడం వంటి సమస్యలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. కాగా.. పరిమితి మేరకు తీసుకోవాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.













Click it and Unblock the Notifications
