వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Chocolate Benefites: చాక్లెట్లు తెగ తింటున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే..

|
Google Oneindia TeluguNews

చాక్లెట్.. ఈ పదం వినగానే పిల్లలు ఎగిరే గంతేస్తారు. ఈ చాక్లెట్ అంటే పిల్లలకు చాలు ఇష్టం ఉంటుంది. పిల్లలే కాదు పెద్దలు కూడా చాక్లెట్లు ఇష్టంగా తినే వారు ఉన్నారు. ముఖ్యంగా యువతులు ఎక్కువగా చాక్లెట్లను ఇష్టపడతారు. అయితే చాక్లెట్లు తినడం మంచిదేనా.. నిపుణులు ఏం చెబున్నారంటే.. పీరియడ్స్ టైమ్ లో చాక్లెట్లు తినొచ్చా.. చూద్దాం..

పీరియడ్స్ టైమ్ లో

పీరియడ్స్ టైమ్ లో

పీరియడ్స్ సమయంలో మహిళలు ఎక్కువగా కోరుకునే ఆహారాలలో ఐస్ క్రీమ్ తో పాటు చాక్లెట్ కూడా ఉంటుంది. ముఖ్యంగా డార్క్ చాక్లెట్. ఈ డార్క్ చాక్లెట్ పీరియడ్స్ నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుందట. ఎందుకంటే దీనిలో ఎక్కువ కోకో బీన్స్ ఉంటాయి కాబట్టి. ఇది ఫ్లేవనాయిడ్లకు గొప్ప మూలంగా ఉంటుంది. దీనిలో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయ కనుక నొప్పి తగ్గే అవకాశం ఉంటుంది.
డార్క్ చాక్లెట్స్

డార్క్ చాక్లెట్స్

ముఖ్యంగా డార్క్ చాక్లెట్స్‌ క్రమం తప్పకుండా తినడం వల్ల శరీర బరువు తగ్గడమే కాకుండా మన శరీరంలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. అదేవిధంగా జీర్ణక్రియ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుందట. డార్క్ చాక్లెట్‌లో ఉండే ఫ్లేవనాయిడ్స్‌ శరీరంలో ధమనులు, సిరల పనితీరును మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.

కోకో డెరివేటివ్‌

కోకో డెరివేటివ్‌

డార్క్ చాక్లెట్ వంటి కోకో డెరివేటివ్‌లలో 70% కంటే ఎక్కువ పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ (HDL)ని పెంచడానికి, మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం వల్ల రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుందట. గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందట.

రక్త ప్రసరణ

రక్త ప్రసరణ

మీ పిల్లలు లెక్కల్లో వీక్‌గా ఉంటే.. మీరు మీ పిల్లలకు చాక్లెట్‌ ఇచ్చి చూడండి. చాక్లెట్‌లో ఫ్లేవనోల్స్ ఉంటాయి, ఇవి మెదడుకు రక్త ప్రసరణను పెంచుతాయి. యూకెలో ఇటీవల జరిగిన అధ్యయనం ప్రకాశం.. ఫ్లేవనోల్స్‌.. పిల్లలో లెక్కలు బాగా చేసే నైపుణ్యాలను మెరుగపరిచినట్లు తెలుసుకున్నారు.

note: ఇది కేవలం సమాచారం మాత్రమ్.. దీనిని వన్ ఇండియా ధృవీకరించలేదు.

English summary
There are many benefits of eating dark chocolate. Eating chocolates is especially good during period time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X