ఈ పువ్వులు వాడండి... షుగరు టాబ్లెట్లు విసిరి కొట్టండి
వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తోంది మధుమేహం. మారుతున్న ఆహారపు అలవాట్లతోపాటు పోషకాహారం తీసుకోకపోవడం, సమయం ప్రకారం భోజనం చేయకుండటం, వ్యాయామం చేయకపోవడంతోపాటు మారుతున్న జీవనశైలి కూడా షుగరు రావడానికి కారణమవుతోంది.
ఆహార నియమాలు పాటించకపోతే సమస్య తీవ్రత రోజురోజుకు పెరిగి అనేక తీవ్ర అనారోగ్యాలకు దారితీస్తుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎటువంటి పోషకాలు లేని ఆహారం తీసుకోవడంవల్ల కూడా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అయితే షుగరును నియంత్రించడానికి కొన్ని రకాల పువ్వులున్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం.

అరటి పువ్వు
అరటి పువ్వుతో వండిన కూర చాలా బాగుంటుంది. శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ ను తగ్గించడంతోపాటు రక్తంలో ఉండే చక్కెర స్థాయిలను కూడా తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతోపాటు బరువును అదుపులో ఉంచుతుంది. అరటి పువ్వును వంటల్లోనే వాడాలి. దీనిలో మెగ్నీషియం, విటమిన్ బి6 ఉంటాయి. మహిళల్లో మెనుస్ట్రువల్ సమస్యను దూరం చేస్తుంది. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి కూడా ఉంటాయి.
డలియా పువ్వులు
చాలామందికి డలియా పువ్వులు అంటే తెలియవు. వీటిగురించి తెలుసుకోవాలి. వీటిల్లో మూడు అణువులు ఉంటాయి. మెదడువాపును తగ్గించడంలో దీనిది ప్రధాన పాత్ర. ప్రీ డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాలను కూడా డలియా పువ్వులు తగ్గిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను ఇవి నియంత్రిస్తాయి. ఈ పువ్వులు వాడటంవల్ల చర్మ సౌందర్యం బాగుంటుంది. చర్మానికి ఎంతో మేలు కలుగుతుంది.

మందార పువ్వు
మందార పువ్వులతో పానీయం చేసుకొని తాగితే షుగరు తగ్గుతుంది. ఇందులో ఉండే పోషకాలు ఇన్సులిన్ ను నిరోధిస్తాయి. జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మందార ఆకులను పేస్టులా చేసుకొని తలకు పట్టిస్తే జుట్టు బలంగా తయారవడంతోపాటు మందార నూనె వాడితే జుట్టు రాలడం తగ్గిపోతుంది.
మడగాస్కర్ పెరివింకిల్
మన పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజు మనకు కనపడుతున్న పువ్వుల్లో చాలావరకు అనేక ఔషధాలు నిండివుంటాయి. అయితే చాలా కొద్దిమందికే వీటిగురించి తెలుస్తుంది. మిగతావారికి తెలియదు. అలాంటివాటిల్లో మడగాస్కర్ పెరివింక్ పువ్వు ఒకటి. దీనివల్ల షుగరు తగ్గడంతోపాటు గొంతుకు సంబంధించిన వ్యాధులు, చర్మవ్యాధులు, రక్తపోటును నయం చేసే శక్తి కూడా ఈ పువ్వులకు ఉంది.












Click it and Unblock the Notifications