Fasting: ఉపవాసం చేసే మహిళలకు వైద్యుల ప్రో టిప్స్.. ఇలా చేస్తే దీర్ఘకాలిక ఇబ్బందులకు చెక్

Health news: భర్తలు, బిడ్డల కోసం మహిళలు ఎక్కువగా ఉపవాసం ఉంటారు. మన సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాల్లో ఇదొక భాగంగా భావిస్తారు. పండుగలు సహా ప్రత్యేక రోజుల్లో కొందరు పూర్తిగా ఆహారం తీసుకోవడం మానేస్తుండగా మరికొందరు ఒక్కపూట మాత్రమే ఘన పదార్థాలను స్వీకరించడం చేస్తారు. ఈ సమయాల్లో శరీరంలోని పలు హార్మోన్లపై తీవ్ర ప్రభావం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఉపవాసం వల్ల పురుషులతో పోలిస్తే స్త్రీలు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఋతు చక్రం మరియు పునరుత్పత్తి వల్ల వివిధ హార్మోన్ల ప్రతిస్పందనలను అనుభవించవచ్చు. ఉపవాసం కారణంగా సక్రమంగా పీరియడ్స్ రావు. ఇది లూటినైజింగ్ హార్మోన్ మరియు అండోత్సర్గాన్ని ప్రభావితం చేస్తుంది. శరీరంలో కార్టిసాల్ స్థాయిలను ప్రేరేపిస్తుంది. కాబట్టి ఉపవాస సమయంలో ఆరోగ్యంగా ఉండటానికి మరియు హార్మోన్ల అసమతుల్యతను నివారించడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

Tips for fasting women during festive season

ఈ సమయంలో శరీరంలో సరైన నీటి స్థాయి ఉండేలా ప్లాన్ చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. భోజనం వేళ తగినంత నీరు త్రాగడం తప్పనిసరి. దీంతో రోజంతా శరీరంలోని వాటర్ లెవల్స్ తగ్గకుండా కాపాడుకోవచ్చు. ఇదికాస్త ఒత్తిడిని తగ్గిస్తూ అలసటను నివారించగలదు. భోజనంలో దోసకాయలు మరియు పుచ్చకాయలు వంటి హైడ్రేటింగ్ ఆహారాలను చేర్చడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

గింజలు మరియు విత్తనాలను ఆహారంలో జోడించాలని డాక్టర్లు సిఫార్సు చేస్తున్నారు. సిట్రస్ మరియు ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని ఎంచుకోవాలి. ఆయిల్ ఫుడ్స్‌ను తినకపోవడం మంచిది. రోజంతా సరిపోయే శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకోవాలి. ఉపవాసం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని భావిస్తే దానికి దూరంగా ఉండటం ఉత్తమం. శుద్ధి చేసిన చక్కెరకు బదులు తేనె మరియు బెల్లం వంటి సహజ స్వీటెనర్లతో కూడిన స్వీట్లను తీసుకోవచ్చు. ఎసిడిటీని నివారించడానికి భోజనం స్పైసీగా ఉండకుండా చూసుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+