టమాటా తినడంవల్ల కలిగే ఉపయోగాలు ఊహించలేనంత లాభం
కూరగాయల్లో ఎక్కువగా వాడేది టమాటా. ఇది లేకుండా ఏ కూర తయారుకాదంటే అతిశయోక్తి కాదు. మొన్నటివరకు దేశవ్యాప్తంగా టమాటా ధరలు మండిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ధరలు తగ్గికిలో రూ.10కు చేరుకున్నాయి.
టమాటాల్లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ 6, ఫోలేట్, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం, భాస్వరం, రాగి, ఫైబర్స్, ప్రొటీన్, లైకోపీన్ వంటి సేంద్రీయ సమ్మేళనాలు ఉంటాయి. టమాటాను ప్రతిరోజు తినడంవల్ల ఎన్నో రోగాల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు.

టమాటాల్లో ఉండే లైకోపీన్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే జీర్ణ సమస్యలు పరిష్కారమవుతాయి. వీటిల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మలబద్దకం, విరేచనాలను ఇవి నివారిస్తాయి. లుటిన్, లైకోపీన్ వంటి ప్రధానమైన కెరోటినాయిడ్లు టమాటాల్లో ఎక్కువగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే టమాటాలను రెగ్యులర్ గా తీసుకోవాలి. దీనివల్ల కళ్లు ఎంతో ఆరోగ్యంగా ఉంటాయి.
టమాటాను ప్రతిరోజు తీసుకోవడంవల్ల చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. మాలిక్యులర్ క్యాన్సర్ రీసెర్చి జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం ఇందులో ఉండే బీటాకెరోటిన్ తీసుకోవడంవల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ కణితిని పెరగకుండా నిరోధిస్తుంది. అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. పొటాషియం ఎక్కువగా ఉండటంవల్ల రక్తపోటు పెరగదు. ఒక కప్పు చిన్న టమాటాలో సుమారు రెండు గ్రాముల ఫైబర్ ఉంటుంది. మధుమేహం ఉన్నవారు కూడా వీటిని తినొచ్చు.












Click it and Unblock the Notifications