హోటల్ స్టైల్ 'టమోటా బాత్'.. ఇలా ట్రై చేయండి.. టేస్ట్ మర్చిపోరు..!
టమోటాలను చూస్తేనే నోరూరుతుంది. కర్రీ ఏదైనా టమోటాలు ఒకటి లేదా రెండు వేస్తే ఆ టేస్టే వేరే లెవెల్ ఉంటుంది. అలాగే అనేక రకాల వంటల్లో టమోటాలను ఉపయోగిస్తారు. వీటితో పప్పు, ఫ్రై లేదా పచ్చడి చేసుకుంటారు. అయితే ఓసారి హోటల్ స్టైల్ లో ఇలా టమోటా బాత్ ట్రై చేశారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది టిఫిన్ తో పాటు లంచ్ లోనూ బాగుంటుంది. పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా ఈ టమోటా బాత్ ను ఇష్టంగా తినవచ్చు. మరి సూపర్ టేస్టీ టమోటా బాత్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి..? టమోటా బాత్ తయారీ విధానం..? ఇక్కడ చూద్దాం..
టమోటా బాత్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. టమోటాలు, బొంబాయి రవ్వ, క్యారెట్, అల్లం, ఉల్లిపాయలు, బఠానీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీడిపప్పు, పసుపు, జీలకర్ర, పసుపు, ఉప్పు తగినంత, నూనె లేదా నెయ్యి తీసుకోవాలి.
టమోటా బాత్ తయారీ విధానం చూస్తే.. ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపై గిన్నె పెట్టుకోవాలి. అందులో బొంబాయి రవ్వను వేసి వేయించుకోవాలి. సన్నటి మంట మీద వేయిస్తే మంచిగా వేగుతుంది. బొంబాయి రవ్వను పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే గిన్నెలో కొద్దిగా నెయ్యి, నూనె వేసి అందులో జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే నూనెలో జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పుతో పాటు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా వేయించుకోవాలి.

ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి, అల్లం తరుగు వేసి పచ్చి వాసన పోయేంత వరకూ వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే టమోటా ముక్కలు, క్యారెట్ తరుగు, పసుపు, కరివేపాకు, పచ్చి బఠానీలు వేసి వేయించుకోవాలి. అందులో నీళ్లు పోసి మరిగించుకోవాలి. ఆ తర్వాత ఉప్పు వేసి మగ్గించుకోవాలి. ఆ మిశ్రమంలో రవ్వ వేసి కలిపి మూత పెట్టుకోవాలి. చివరగా కొత్తిమీరతో పాటు ముందుగా వేయించిన జీడిపప్పు, కొద్దిగా నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే సూపర్ టేస్టీ టమోటా బాత్ రెడీ అయినట్టే..
-
బ్యాచిలర్ స్టైల్ మటన్ కర్రీ.. ఇలా సింపుల్ గా చేసుకోండి..! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ












Click it and Unblock the Notifications