ఇది పిచ్చి మొక్క కాదు.. వంద అనారోగ్య సమస్యలకు చెక్..!

మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో చాలా మొక్కలను చూస్తుంటాం. రకరకాల మొక్కలు పెరుగుతుంటాయి. వాటిలో ఔషధ గుణాలు కలిగిన మొక్కలు కూడా చాలానే ఉన్నాయని మనకు తెలియదు. వాటిని పిచ్చి మొక్కలుగా భావిస్తుంటాం. కానీ ఈ మొక్కల్లో వంద అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టేంత సామర్థ్యం ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. వాటిలో వాము మొక్క ప్రధానమైనది. ఇది పిచ్చి మొక్క‌లా కనిపిస్తుంటుంది.. కానీ ఈ మొక్క ఎన్నో ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంది. ఈ మొక్క అద్భుత‌మైన లాభాల‌ను అందిస్తుంది.

వాము మొక్క ఆకులను నీటిలో మ‌రిగించి ఆ నీళ్ల‌ను తాగితే అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. వాము ప‌లు వ్యాధుల‌ను న‌యం చేస్తుంద‌ని అంటున్నారు. అలాగే వాములోని థైమోల్ అనే సమ్మేళనం జీర్ణ ఎంజైమ్‌ ల ఉత్పత్తిని పెంచుతుది. తద్వారా ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా సహాయపడుతుందని నిపుణులు వివరిస్తున్నారు. అంతేకాక వాము గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం నుంచి ఉపశమనం కలిగిస్తుందని చెబుతున్నారు.

Vamu Leaves Doctors Reveal Key Health Advantages

ఈ ఆకులను తీసుకోవడం ద్వారా వల్ల దగ్గు, జ‌లుబు, ఇత‌ర శ్వాస స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. గొంతు, ఊపిరితిత్తుల్లో ఉండే క‌ఫం క‌రిగిపోతుందని వైద్యులు వివరిస్తున్నారు. ముక్కు దిబ్బ‌డ నుంచి ఉప‌శ‌మ‌నంతో పాటుగా ఆస్త‌మా, బ్రాంకైటిస్ ఉన్న‌వారికీ మేలు జ‌రుగుతుందని చెబుతున్నారు. ఆయుర్వేదంలో వామును కడుపు ఉబ్బరం, అలసట, విరేచనాలు, పొత్తికడుపు నొప్పి, శ్వాసకోశ సమస్యలు, ఆకలి వేయకపోవడం వంటి వివిధ చికిత్సలకు ఉపయోగిస్తారని వైద్యులు వివరిస్తున్నారు. అలాగే వాము శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+