Veg Momos Recipe: స్ట్రీట్ స్టైల్ 'వెజ్ మోమోస్' ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
ఇటీవలి కాలంలో ఫుడ్ ప్రియులు ఎక్కువగా ఇష్టపడే రెసిపీలలో మోమోస్ ఒకటి. చాలామంది వెరైటీ రకం మోమోస్ ను తినడానికి ఇష్టపడుతుంటారు. అయితే బయట లభించేవి అంత హెల్దీనా..? కాదా..? తెలియదు. కాబట్టి ఇంట్లోనే ఇలా ఈజీగా వెజ్ మోమోస్ ప్రిపేర్ చేసుకోండి. ఇలా చేస్తే చాలా రుచిగా ఉంటాయి. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఈ సూపర్ టేస్టీ వెజ్ మోమోస్ ను ఎలా తయారు చేయాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
వెజ్ మోమోస్ తయారీకి కావాల్సన పదార్థాలు చూస్తే.. మైదా పిండి రెండు కప్పులు, క్యాబేజీ తరుగు రెండు కప్పులు, క్యారెట్ తరుగు అర కప్పు, క్యాప్సికమ్ తరుగు అర కప్పు, ఉల్లిపాయ ముక్కలు ఒకటి చిన్నది, అల్లం, వెల్లుల్లి తరుగు ఒక టేబుల్ స్పూన్, మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్, సోయా సాస్ ఒక టేబుల్ స్పూన్, నూనె రెండు టేబుల్ స్పూన్ లు, ఉప్పు రుచికి సరిపడా, నీళ్లు సరిపడా తీసకోవాలి. ఇప్పుడు వెజ్ మోమోస్ తయారీ విధానం చూస్తే..

ముందుగా మైదా, ఉప్పు, నూనె, నీళ్లు కలిపి 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నూనెలో కూరగాయలు, సాస్, ఉప్పు వేసి పెద్ద మంటపై వేయించాలి. ఆ తర్వాత చల్లార్చాలి. ఇప్పుడు పూరీలా ఒత్తి, స్టఫింగ్ పెట్టి, మీకు నచ్చిన ఆకారంలో మోమోస్ ను చుట్టాలి. ఆ తర్వాత స్టీమర్ పై 10 నుంచి 12 నిమిషాలు ఆవిరిపై ఉడికించాలి. అంతే ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే.. సూపర్ టేస్టీ వెజ్ మోమోస్ రెడీ అయినట్టే.












Click it and Unblock the Notifications