ఇది తీసుకుంటే ముఖంపై వృద్ధాప్య ఛాయలు రావు

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. మనం ఆరోగ్యంగా ఉండేలాంటే శరీరానికి అవసరమైన పోషకాలు తీసుకుంటుండాలి. లేదంటే అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. విటమిన్లు, ఖనిజాలు శరీర పెరుగుదలకు ముఖ్యమైనవి. శరీరానికి ముఖ్యమైంది విటమిన్ సి(Vitamin C). ఇది లోపిస్తే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

విటమిన్ సి శరీరంలో రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. అలాగే వైరల్ ఇన్ ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. ఇది లోపిస్తే రక్తంలో గ్లూకోజ్ స్థాయులు ప్రభావితమవుతాయి. అది మధుమేహానికి దారితీస్తుంది. అందుకే షుగరు వ్యాధిగ్రస్తులు విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను తీసుకుంటుండాలి. అలాగే గుండె జబ్బులకు దారి తీస్తుంది. విటమిన్ సి లేకపోవడంవల్ల గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రక్తం లేకపోవడంవల్ల రక్తహీనత ఏర్పడుతుంది.

vitamin c health benefits and uses in telugu

విటమిన్ సి శరీరంలో ఐరన్ గ్రహించడానికి సహాయపడుతుంది. దంతాలు, చిగుళ్లు బలహీనపడతాయి. ఇన్ ఫెక్షన్ పెరిగి గాయాలు కూడా మానకుండా అలాగే ఉంటాయి. న్యూమోనియా సమస్య కూడా ఎదురవుతుంది. ఇప్పటికే న్యూమోనియా బారిన పడివుంటే విటమిన్ సి అధికంగా ఉండే పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. సిట్రస్ పండ్లు, నారింజ, నిమ్మకాయ, కివి, బొప్పాయితోపాటు వివిద రకాల కూరగాయల నుంచి ఇది లభిస్తుంది. ఎముకలు, కణజాలాలు, సిరలు, ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి చాలా ముఖ్యమైంది.

విటమిన్ సి అనేది వివిధ ఆహార వనరుల నుండి శరీరం ఎక్కువగా గ్రహించే విటమిన్, ఎక్కువగా సిట్రస్ పండ్లు నారింజ, నిమ్మకాయలు, కివి, బొప్పాయి మొదలైనవి మరియు వివిధ కూరగాయల నుండి. ఆరోగ్యకరమైన ఎముకలు, కణజాలాలు, సిరలు మరియు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి విటమిన్ సి (Vitamin C) ముఖ్యమైనది. శరీరంలో అన్నిరకాల కణజాలాలను వృద్ధి చేస్తుంది. కొల్లాజెన్ నిర్మాణంతోపాటు ఐరన్ గ్రహించడం, గాయాలను మాన్పించడంతోపాటు ఎముకలు, పళ్లు, మృదులాస్థి బలంగా ఉండేందుకు దోహదపడుతుంది. కొందరికి యవ్వనంలోనే చర్మంపై ముడతలు ఏర్పడతాయి. అలాంటివారు.. విటమిన్-సి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తప్పనిసరిగా తీసుకోవాలని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లీనికల్ న్యూట్రీషియన్‌లో వ్యాసం వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+