విటమిన్ సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకుంటున్నారా?
ఒక మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉండాలంటే శరీరానికి విటమిన్స్, మినరల్స్ రెండూ అందాలి. అన్నీ కలగలిపి ఉంటేనే షోషకాహారమవుతుంది. ప్రపంచంలో అన్ని వయసుల వారు ఫుడ్ సప్లిమెంట్ల రూపంలో విటమిన్ మాత్రలను ఉపయోగిస్తున్నారు. ఇవి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. దీనివల్ల మనకు అనారోగ్యం కలగకుండా ఉంటుంది. అయితే వైద్య నిపుణులు ఎంత మోతాదులో అయితే సూచిస్తారో అంత మోతాదులోనే వీటిని తీసుకోవాల్సి ఉంటుంది.

మోతాదు మించితే దుష్ప్రభావాలు: మోతాదు మించి తీసుకుంటే దుష్ప్రభావాలు కలుగుతాయి. విటమిన్ సి సురక్షితమైనదని అందరూ భావిస్తారు. కానీ అది డోస్ ఎక్కువైతే జీర్ణ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాదు.. కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. అలాగే విటమిన్ బి12ను కూడా కొద్ది మోతాదులోనే తీసుకోవాలి. ఇది అందరికీ పడదు. దీన్ని తీసుకున్న తర్వాత విరేచనాలు, తల తిరగడం లాంటి లక్షణాలు కనపడితే అది మనకు పడలేదని అర్థం చేసుకోవాలి. వెంటనే వైద్యులను సంప్రదిస్తే బీ12 అవసరమైనవారికి ఇంజెక్షన్ రూపంలో ఇస్తారు.

వైద్యుల సూచించిన మేరకే..:
ఒమెగా 3 మన శరీరానికి పడకపోతే నోటి దుర్వాసన వస్తుంది. అంతేకాకుండా జీర్ణ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. రక్తం పలచనయ్యేందుకు ఈ సప్లిమెంటు ఉపయోగిస్తుంటే.. ఒకవేళ అది పడకపోతే రక్తస్రావం జరుగుతుంది. అలాగే ఐరన్ సప్లిమెంట్ పడకపోతే మలబద్దకం ఏర్పడుతుంది. తల తిరగడం లాంటి సమస్యను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఐరన్ మోతాదు పెరిగితే హిమక్రోమోటోసిస్ పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. హెర్బల్ ఔషధాలు, బరువు తగ్గేవి, హార్మోన్ ఆదారిత ఔషధాలతో కొన్ని రిస్క్ లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సొంతంగా అసలు తీసుకోకూడదు. వైద్యులను సంప్రదించి వారి సూచనల మేరకు మాత్రమే విటమిన్ సప్లిమెంట్లను తీసుకోవాలి.












Click it and Unblock the Notifications