డయాబెటిస్ కంట్రోల్ లో ఉండాలన్నా, బ్రెయిన్ హెల్త్ కావాలన్నా ఇవి తినండి చాలు!
మనం తీసుకునే ఆహారాలలో డ్రైఫ్రూట్స్ మనకు ఎంతో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. అలా ఆరోగ్యాన్ని ఇచ్చే వాటిలో వాల్ నట్స్ ఒకటి. మెదడు ఆకారంలో ఉండే వాల్నట్లు కేవలం జ్ఞాపకశక్తికి మాత్రమే మంచివి కావు. వాటిని ప్రతిరోజూ తినడం వల్ల శరీరాన్ని అనేక సమస్యల నుండి కాపాడుకోవచ్చు.
వాల్నట్ ఆరోగ్య ప్రయోజనాలు
మెదడు ఆకారంలో ఉండే వాల్నట్లు మెదడుకు చాలా మంచివిగా పరిగణించబడతాయి. ఇవి జ్ఞాపకశక్తిని బాగా పెంచుతాయి. ఎందుకంటే వీటిలో ఫైబర్, మాంగనీస్, మెగ్నీషియం, రాగి, ఇనుము, కాల్షియం, జింక్, పొటాషియం, విటమిన్ బి6, ఫోలేట్ మరియు థయామిన్ వంటి పోషకాలు ఉంటాయి.

వాల్ నట్స్ ఇలా తింటే ఆరోగ్యం
ఇవి శరీరానికి అనేక ప్రయోజనాలను అందించడంలో సహాయపడతాయి. అయితే, వాల్నట్లను సరైన పద్ధతిలో ఎలా తినాలో మీకు తెలుసా? తెలియకపోతే, ఆలస్యం చేయకుండా వాటి ప్రయోజనాలను మరియు తినే పద్ధతిని తెలుసుకుందాం. వాల్నట్లను ఆహారంలో అనేక విధాలుగా చేర్చుకోవచ్చు. అయితే, వాటిని నానబెట్టి తినడం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది.
మెదడుకు బెస్ట్ ఫుడ్
ఉదయం ఖాళీ కడుపుతో నానబెట్టిన వాల్నట్లను తినడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. మీరు వాటిని సలాడ్‌లో కలుపుకొని లేదా అల్పాహారం కోసం ఓట్స్‌లో కలుపుకొని కూడా తినవచ్చు. వాల్ నట్స్ తినడం వల్ల మన శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే ఇవి మెదడుకు చాలా బాగా పనిచేస్తాయి. మెదడు ఆకారంలోనే ఉండే వాల్నట్స్, మనం మెదడును చురుకుగా పనిచేసేలా చేస్తాయి
ఎముకల బలానికి, బరువు తగ్గటానికి ఇవి ఉపయోగం
అంతేకాదు వాల్ నట్ లలో క్యాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఉండడం వల్ల, ఇవి ఎముకలను బలోపేతం చేయడానికి ఎంతగానో దోహదం చేస్తాయి. వాల్నట్లలో ఫైబర్ మరియు ప్రోటీన్ అధికంగా ఉంటాయి. ఇవి ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి. ఇవి బరువు తగ్గడానికి ఎంతగానో దోహదం చేస్తాయి.
డయాబెటిస్ బాధితులకు వాల్ నట్స్ బెస్ట్
వాల్నట్లలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. డయాబెటిస్ తో బాధపడేవారు వాల్ నట్ లను తినడం రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి ఇది దోహదం చేస్తుంది. దీనిని ప్రతిరోజు మధుమేహ బాధితులు అల్పాహారంగా కూడా తీసుకోవచ్చు. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న వాల్ నట్స్ కచ్చితంగా మీ ఆహారంలో భాగంగా చేసుకోండి.












Click it and Unblock the Notifications